ఓయూలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్

-ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలోనూ ప‌ర్య‌టించాల‌నుకున్న రాహుల్
-ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాకరించిన వర్సిటీ అధికారులు
-నేడు హౌస్ మోష‌న్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌ర‌పాలంటూ విన‌తి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నెల 7న హైద‌రాబాద్‌, తార్నాక‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోనూ ప‌ర్య‌టించి,‌ విద్యార్థుల‌తో ఆయన ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నారు. దీంతో అక్క‌డ‌ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వ‌బోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళ‌న‌ల‌కు దిగుతోంది. ఈ నేప‌థ్యంలో రాహుల్ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వ‌లేదు. దీంతో ఈ నెల 7న విద్యార్థుల‌తో ముఖాముఖికి అనుమ‌తి ఇవ్వాలంటూ హైకోర్టులో మాన‌వ‌తారాయ్ స‌హా న‌లుగురు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నేడు ఈ హౌస్ మోష‌న్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌ర‌పాల‌ని వారు కోరారు.

Leave a Reply