రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వచ్చి విద్యార్థి నాయకులను కలుస్తారు…

ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చాము.7 వ తేదీ న బలమురి వెంకట్ తో పాటు 18 మంది నాయకులను కలవడానికి రాహుల్ గాంధీ తో సహా మేమంతా వస్తాం.అందుకు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరాం.జైలు అధికారులు స్వతంత్రగా వ్యవహరించాలి.

రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలి.రాహుల్ గాంధీ ఓయూ పర్యటన పై మా నేతలు విసి ని కలిశారు.విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ గాంధీ రావాలని కోరారు.కేసీఆర్ ఒత్తడి వల్ల రాహుల్ గాంధీ పర్యటన ను తిరస్కరించారు.Nsui విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసి ని విజ్ఞప్తి చేశారు.అక్కడికి వెళ్లిన మా విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారు.ఓయూ లో విద్యార్థి నాయకులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండేవారు.

Leave a Reply