నకిలీ పట్టాలతో కొడాలి నాని జగన్నాటకం

– ఎన్నికల అనంతరం దుర్మార్గుడిని వేటాడి అక్రమాలకు తగిన గుణపాఠం
– దొంగ పట్టాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఉద్యోగి వినీత్ కు గుణపాఠం తప్పదు
– జగనన్న కాలనీలో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హెచ్చరిక

జగనన్న కాలనీ భూముల్లో, పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చే ప్రయత్నాలు, ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్నాడు. దొంగ సంతకాలతో పట్టాలు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు రంగం సిద్ధం చేశారు. ఓడిపోతానని తెలిసి కొడాలి నాని చివరి క్షణంలో అధికారం కోసం అక్రమాలు చేస్తూ, అధికారులను బలి చేస్తున్నారు. అధికార దాహంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

పట్టాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుడు తమ స్థల పొజిషన్ చూపించాలని చోక్క పట్టుకొని అడగాలి. ఎమ్మార్వో,ఆర్డీఓ సంతకాలు లేకుండా పట్టాలు ఎలా ఇస్తారు? ఎన్నికల సమీపించిన వేళ నిన్నటి దాకా విగ్రహాల శంకుస్థాపన పేరుతో డ్రామాలు ఆడాడు. అయిదేళ్ళు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, ఎప్పుడో కట్టిన భవనాలకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడు.

పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు; పట్టణ పేద ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని తెలిసి, ఎమ్మెల్యే నాని దొంగ పట్టాల పంపిణీకి తెరలేపుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. జగనన్న కాలనీలోని 30 ఎకరాల భూమిలో లేఅవుట్ లేకుండా, దొంగ పట్టాలిచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. నందివాడ మండలం రెవెన్యూ ఉద్యోగి వినీత్ అక్కడ సంతకం పెట్టి, గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాలెంటిర్లను పిలిపించి, వారి ద్వారా సేకరించిన డేటాతో నకిలీ పట్టాల పంపిణీకు సిద్ధం చేశారు. పనికి రాని నకిలీ పట్టాలు, ఇస్తే లబ్ధిదారులు ఏం చేసుకుంటారు? ఎన్నికలవేళ దొంగ శంకుస్థాపనలు చేస్తూ , నకిలీ పట్టాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే తనదైన నీచ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఓట్ల రాజకీయాన్ని ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే అక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న అధికారులు, ఎన్నికలు అనంతరం మూల్యం చెల్లిస్తారు.

మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, వసంతవాడ దుర్గారావు, పొట్లూరు కృష్ణారావు, మెరుగు మోజెస్, తదితర నాయకులు నకిలీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఖండించారు.

Leave a Reply