Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘనంగా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనేశ్వరి పేద పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పించడం, వరద బాధితులు కావచ్చు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను వైద్య సేవల ద్వారా కొన్ని వందల కుటుంబాలను ఆదుకుంటున్న నారా భువనేశ్వరి కి దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేయాలని వారు కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి A V రమణ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్ చినబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,యువత

కార్యక్రమాల కోఆర్డినేటర్ రవి నాయుడు, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ప్రపుల్ల, తమ్మినేని మోహన్, ప్రణీత్,అశోక్ యాదవ్, గోపి,ఆనంద్ గౌడ్, ఆశీస్, కుమార్ చౌదరి, అసం భాష , పరుచూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE