కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు

94

– మహిళా కమీషన్ ఛైర్మన్ పై పోరాడటానికి సిగ్గుందా
– మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరం. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడు. ఈ కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు.బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్ లో ఉన్నాడు.

బోండా ఆకు రౌడీ అనుకున్నా…కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు.రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బోండా ఆడిన ఆటలో బాబు పావుగా మారాడు.ఓ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నాడు.ఏప్రిల్ 27న కమీషన్ ముందుకు రావడానికి చంద్రబాబు,బోండా ఉమాకు భయమేంటి?

మహిళా కమీషన్ సమన్లు పంపిన రోజే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మహిళలతో నిరసనకు చేయడమేంటి?కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా?నేను ఏదీ పర్సనల్ గా తీసుకోలేదు.మహిళా కమీషన్ పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును మాత్రమే సీరియస్ గా తీసుకున్నా. నేను ప్రైవేట్ కంప్లైట్ వేయలేకా…నాకు చేతకాదా? మహిళా కమీషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమీషన్ ఛైర్మన్ గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా?

నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు.బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు.ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారీ బోండా ఉమ.బోండా ఉమ మహిళల పట్ల శోయలేకుండా మాట్లాడుతున్నాడు.విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు విద్యార్ధి బలైపోతే ఒక్క టీడీపీ నేత వచ్చాడా?వినోద్ జైన్ కేసులో మూడు నెలలైనా స్పందించని దిక్కుమాలిన పార్టీ మీది.

నాకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదు.నీ వల్ల సాదాసీదాగా జరగాల్సిన పరామర్శ ఇంత పబ్లిసిటీకి దారితీసింది.ఇష్టానుసారంగా మహిళల పట్ల మాట్లాడితే చెప్పుదెబ్బలు తినడం ఖాయంబోండా ఉమ ఒక ఛీడ పురుగు…నీకు మహిళలే బుద్ధి చెబుతారు. ప్రభుత్వం బాధితురాలికి ఏవిధంగా చేయాలో చేస్తుంది.
టీడీపీ తరపున ఇస్తామన్న ఐదు లక్షలు ఇచ్చారా?టీడీపీ అంటే నిలువెల్లా అహంకారం ఉన్న పార్టీ. టీడీపీ అంటే మనువాదుల పార్టీ. టీడీపీ అంటే మగ అహంకార పార్టీ. టీడీపీ అంటే మహిళలంటే గౌరవం లేని పార్టీ. మహిళా కమీషన్ ఛైర్మన్ పై పోరాడటానికి సిగ్గుందా?