పోలవరం మీ చేతుల్లో లేనప్పుడు రీఎంబర్స్‌మెంట్ ఎందుకు అడుగుతున్నారు?

పోలవరం మీ చేతుల్లో లేనప్పుడు రీఎంబర్స్‌మెంట్ఎందుకు అడుగుతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. పోలవరం ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం గత మూడు సంవత్సరాల్లో విడుదల చేసిన నిధులు తిరిగి పోలవరానికి ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పశ్చిమ ప్రకాశం లైఫ్ లైన్ ప్రాజెక్టు వెలుగొండ పూర్తి అయ్యిందని అనడం ప్రజలను వంచించే ప్రయత్నం కాదా అని లంకా దినకర్ ప్రశ్నించారు.