యువతీ, యువకులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్
చంద్రబాబు పాలన లో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిపోయింది. గూగుల్ లో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. రాసిపెట్టుకోండి ఇది నా హామీ. స్వయం ఉపాధి కి పెద్ద పీట వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రత్యేకంగా కేటాయిస్తాం. కేజీ నుండి పీజీ వరకూ సిలబస్ ని ప్రక్షాళన చేస్తాం. విద్యార్థులను జాబ్ రెడీ యూత్ గా తీర్చిదిద్దుతాం. కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళలు పడే కష్టాలు, వారి గొప్పతనం, విలువ తెలిసేలా విద్యార్ధి దశ నుండే తెలిసి మహిళల్ని గౌరవించే విధంగా తీర్చిదిద్దుతాం. చంద్రగిరి నియోజకవర్గం ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి నియోజకవర్గం యువతీ, యువకులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
అనిషా బీటెక్ విద్యార్థిని
రాష్ట్రం నుండి కంపెనీలు వెళ్లిపోతున్నాయి. తిరిగి ఏపికి రావడానికి ఏం చర్యలు తీసుకుంటారు?
లోకేష్ సమాధానం
చంద్రబాబు గారికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్…జగన్ అంటే జైలు… లక్ష కోట్లు ప్రజా ధనం దొబ్బి జైలు కి వెళ్లినవాడిని చూసి పెట్టుబడులు ఎవరు పెడతారు. జగన్ పాలన పోయి టిడిపి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు ఏపికి క్యూ కడతాయి. రాష్ట్రానికి జగరోనా వైరస్ పట్టింది. దానికి వ్యాక్సిన్ చంద్రబాబు. కేజీ టూ పీజీ సిలబస్ ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం.
మోహన్ దళిత విద్యార్ధి
దళితులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి సహకారం అందిస్తారు.
లోకేష్ సమాధానం
జగన్ యువత ను మోసం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు.2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతి ఏడాది 6500 పోలీసు ఉద్యోగాలు ఇస్తాం అని జగన్ మోసం చేశారు.డిఎస్సీ ఏర్పాటు చేస్తాం అని మోసం చేశారు. టిడిపి హయాంలో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని వైసిపి ప్రభుత్వమే మండలి లో ఒక ప్రశ్న కు సమాధానం ఇచ్చింది. టిడిపి హయాంలో 2 సార్లు డిఎస్సీ ఏర్పాటు చేసి 32 వేల ఉద్యోగాలు ఇచ్చాం. స్వయం ఉపాధి కి టిడిపి హయాంలో ప్రోత్సాహం ఇచ్చాం. వైసిపి పాలన లో స్వయం ఉపాధి కి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తాం.
సరోజ విద్యార్దిని
ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు…బస్సు చార్జీలు విపరీతంగా పెంచేశారు.
లోకేష్ సమాధానం
టిడిపి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉండేది. డైరెక్ట్ గా కాలేజీలకు డబ్బు చెల్లించే వాళ్ళం.
జగన్ వచ్చి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తేసి జగన్ పాలన లో విద్య దీవెన , వసతి దీవెన పథకాలు తీసుకొచ్చారు. ఈ రెండు పథకాలు పనికిమాలిన పథకాలు. డబ్బులు పడక విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హాల్ టికెట్ కావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. ఫీజు కట్టాలి అంటూ కాలేజీల ఒత్తిడి. పరీక్షలు రాయాలి అంటే ముందు ఫీజు కట్టాలి అంటూ ఒత్తిడి చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వంటేనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొస్తాం. ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించడం తో పాటు ఇంజనీరింగ్ తో సహా ఉన్నత విద్య చదివే అందరికీ ఉచితంగా బస్సు పాస్ లు అందిస్తాం.పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసిన దుర్మార్గుడు జగన్. ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. ఉదయం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేస్తాడు. విదేశీ విద్య పథకం రద్దు చేసాడు.మనకి కోడి గుడ్డు మంత్రి ఉన్నాడు ఆయన పరిశ్రమల శాఖ మంత్రి కాదు. పరిశ్రమలు తీసుకురావడం చేతగాక కోడి గుడ్డు కథలు చెబుతున్నాడు.కడప స్టీల్ ఫ్యాక్టరీ కి రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఘనత జగన్ కే దక్కింది. ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో మరో మోసానికి తెరలేపింది జగన్ ప్రభుత్వం. గతంలో టిడిపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో మళ్ళీ ఒప్పందాలు చేసుకోవడానికి జగన్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబు గారు.అనంతపురం కి కియా ఆటో మొబైల్ కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు గారు.తిరుపతి కి ఫాక్స్ కాన్, సెల్ కాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తీసుకొచ్చింది టిడిపి. విశాఖ కి కాండ్యుయేంట్ లాంటి ఐటి కంపెనీలు తెచ్చింది టిడిపి. అదానీ డేటా సెంటర్ తీసుకురావడానికి ఒప్పందం చేసుకోవడం తో పాటు భూమి కేటాయించింది టిడిపి. వైసిపి వచ్చిన తరువాత ఆ కంపెనీ ఏర్పాటు ముందుకు సాగలేదు.
జీవన్
రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంది. మీరు గెలిస్తే అప్పు ఎలా తీరుస్తారు?
లోకేష్ సమాధానం
జగన్ పాలన లో మొత్తం అప్పు 12 లక్షల కోట్లు దాటబోతుంది. వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి సరిపోని పరిస్థితి రాబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని కాపాడిన ఘనత చంద్రబాబు గారికే దక్కింది. మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రీబిల్డ్ చేస్తాం. ఆదాయం సృష్టించి రాష్ట్రాన్ని గాడిన పెట్టే సత్తా ఒక్క చంద్రబాబు గారికే ఉంది. మౌలిక వసతుల కల్పన పై పెట్టుబడి పెడితే రాష్ట్రం తిరిగి పుంజుకుంటుంది.
గోపి
క్రీడలకు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తారు
లోకేష్ సమాధానం
స్పోర్ట్స్ అంటే జగన్ కి పబ్జీ మాత్రమే తెలుసు. పుల్లెల గోపీచంద్ లాంటి ఎంతో మందిని ప్రోత్సహించింది టిడిపి.అంతర్జాతీయ స్థాయి లో క్రీడలు నిర్వహించింది టిడిపి ప్రభుత్వం. చిత్తూరు కేంద్రం గా స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటు చేస్తాం. నేషనల్ గేమ్స్ కి వెళ్ళడానికి కనీసం కిట్స్ ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది
సుధీర్
యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆపడానికి మీరు ఎం చేస్తారు.
లోకేష్ సమాధానం
గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో కొడితే ఏపి అని వస్తుంది. చంద్రబాబు గారు పాలన జాబ్స్ క్యాపిటల్ గా ఉన్న ఏపి జగన్ పాలన లో గంజాయి క్యాపిటల్ గా మారింది.గంజాయి వలన ఎంతో మంది ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రగిరి లో పదో తరగతి చదివే పిల్లలతో గంజాయి అమ్మిస్తున్నారు వైసిపి నాయకులు. ఆత్మహత్యలు తగ్గించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మెంటల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. యువత కు నేను ఇచ్చే పిలుపు సే నో టూ డ్రగ్స్. రాష్ట్రంలో గంజాయి ని నియంత్రించాలని ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నాను.
చక్రి
స్టార్ అప్ కంపెనీలకు ఎటువంటి సహకారం అందిస్తారు?
లోకేష్ సమాధానం
స్టార్ అప్ కంపెనీలకు పెద్ద ఎత్తున సహకారం అందించింది టిడిపి ప్రభుత్వం. విశాఖ లో మిలీనియం టవర్స్ నిర్మించి ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించాం. రాయితీలు ఇచ్చాం. ఇప్పుడు చేపల షాపులు, మటన్ షాపులు పెట్టడం జగన్ గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
పవిత్ర
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదు.
లోకేష్ సమాధానం
ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం. జగన్ పాలనలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు. 108 రాదు. మంగళగిరి లో ఎన్టీఆర్ సంజీవని అనే కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం అందించి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేస్తున్నాం. ఆహారపు అలవాట్లు, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు. అలాంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
శ్రీధర్
రాయలసీమ యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన అమర్ రాజా తెలంగాణ కి వెళ్ళిపోయింది. దీని పై మీ అభిప్రాయం ఎంటి?
లోకేష్ సమాధానం
రాయలసీమ బిడ్డ అని జగన్ కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకున్నారు.కానీ ఆయన రాయలసీమ కు పట్టిన శని.రాష్ట్రంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టే సంస్థ అమర్ రాజా. ఎంపి జై దేవ్ ని పార్టీ మారమని వైసిపి ఒత్తిడి చేసింది. దానికి ఆయన ఒప్పుకోలేదు అందుకే కక్ష కట్టి వేధించారు.అందుకే అమర్ రాజా తెలంగాణ కి వెళ్ళిపోయింది. 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగాలు కోల్పోయారు. నేను మంత్రి గా ఉన్నప్పుడు అంబానీ ని ఒప్పించి తిరుపతి లో సెల్ ఫోన్ తయారీ కంపెనీ ఏర్పాటుకు ఒప్పించాను. భూములు కేటాయించాను ఆ భూములు వైసిపి ప్రభుత్వం వెనక్కి లాక్కొని రిలయన్స్ ని తరిమేశారు. దీని వలన 50 వేల మంది యువతీ, యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. జగన్ బెదిరింపుల వలన 10 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం.
ధనుంజయ్ రెడ్డి
పాడి పరిశ్రమ, వ్యవసాయం లో కూడా యువతను ప్రోత్సహించాలి. విత్తనం నుండి ఎరువులు, పురుగుల మందులు వరకూ అన్ని పెరిగిపోయాయి. ఇప్పుడు కనీసం మద్దతు ధర లేదు.
లోకేష్ సమాధానం
వ్యవసాయం లో పెట్టుబడి తగ్గించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.రాయలసీమ నీటి పారుదల రంగం పై చంద్రబాబు గారు ఖర్చు చేసిన దాంట్లో 10 శాతం కూడా జగన్ ఖర్చు చెయ్యలేదు.డ్రిప్ ఇరిగేషన్ ను జగన్ చంపేశాడు.కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడి, చెరుకు రైతులకు అదనంగా రేటు ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించింది టిడిపి.పాడి పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.యువత ను వ్యవసాయం, పాడి పరిశ్రమ వైపు కూడా ప్రోత్సహిస్తాం.
రాంజీ
యువత రాజకీయాల్లోకి రావాలా? వద్దా?
లోకేష్ సమాధానం
మార్పు కావాలని ఇంట్లో కూర్చుంటే రాదు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించాలి. కష్టపడి ప్రజల మనస్సు గెలుచుకోవాలి. ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయాలి. వచ్చే ఎన్నికల్లో టిడిపి యువత కి 40 శాతం సీట్లు యువతకు ఇస్తుంది. నా పాదయాత్ర పేరే యువగళం.ప్రతి రోజూ ఆంధ్రా ఎడిషన్ పేపర్లు చూస్తే గంజాయి పట్టుకున్నారు, మహిళల పై అత్యాచారాలు వార్తలే చూస్తున్నాం.ఇతర రాష్ట్రాల పేపర్ ఎడిషన్లు చూస్తే రోజుకో పరిశ్రమ వచ్చింది, ఇన్ని ఉద్యోగాలు కల్పించాం అనే వార్తలు వస్తున్నాయి.
కీర్తి
మహిళలకు రాష్ట్రం భద్రత లేదు…టిడిపి వస్తే భద్రత కు భరోసా ఇస్తారా?
జగన్ పాలనలో అత్యాచారాలు పెరిగిపోయాయి. గంజాయి ప్రభావంతో దారుణాలు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గంజాయి మత్తు లో రాజు అనే వ్యక్తి దళిత యువతి రాణి ని కిరాతకంగా చంపాడు.
తిరుమల లో గంజాయి దొరుకుతుంది అంటే ఎంత దారుణ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చాకా మహిళల వైపు చూసిన వారి తోలు తీస్తాం.
కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళలు పడే కష్టాలు, వారి గొప్పతనం, విలువ తెలిసేలా విద్యార్ధి దశ నుండే తెలిసి మహిళల్ని గౌరవించే విధంగా తీర్చిదిద్దుతాం.
నా తల్లిని అసెంబ్లీ లో వైసిపి శాసనసభ్యులు అవమానిస్తుంటే సిఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మంత్రులు చేతులకు గాజులు వేసుకున్నావా? చీర, గాజులు పంపిస్తా అని మాట్లాడటం. చెల్లి కి మళ్లీ మళ్లీ పెళ్లి అంటూ పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడటం వలనే రాష్ట్రంలో మహిళల పై దాడులు పెరిగిపోతున్నాయి.