జగన్ రెడ్డి రైతు సంక్షేమం అంతా అబద్ధాలు, మోసాలు, సాక్షి మీడియాకే పరిమితం

– 2022జూన్ 14న జగన్ రెడ్డి ఆర్భాటంగా విడుదలచేసిన రూ.2,917కోట్లు పంటనష్టపరిహారం సొమ్ము, నేటికీ రైతులకు అందలేదు.
– జగన్ జమానాలో రైతులు సంతోషంగా ఉంటే, వారిఆత్మహత్యల్లో రాష్ట్రం ఎందుకు అగ్రస్థానంలో ఉంది?
• తెనాలి సభలో జగన్ రెడ్డి అరుపులు, కేకలతో తాను చేయని సాయాన్ని, సంక్షేమాన్ని చేస్తున్నట్టు రైతుల్ని నమ్మించడానికి ప్రయత్నించాడు.
• అబద్ధాలు,మోసాలతో రాష్ట్రరైతాంగాన్ని మరోసారి నమ్మించి, వచ్చేఎన్నికల్లో పబ్బంగడుపుకోవాలన్నదే జగన్ తాపత్రయం.
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

జగన్మోహన్ రెడ్డి నిన్నతెనాలిలో ఉత్తుత్తిబటన్లు నొక్కి, బూటకపు రైతుభరోసాపేరుతో మరోసా రి రైతుల్ని వంచించే తన రైతుద్రోహాం నైజాన్ని బయటపెట్టుకున్నాడని, అబద్ధాలు, అవాకు లు, చవాకులు, చౌకబారుసవాళ్లతో ముఖ్యమంత్రి నిన్నటి బహిరంగసభలో వికృతవిన్యాసా లన్నీ ప్రదర్శించాడని తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“కష్టం, కన్నీళ్లు తప్పమరోటి తెలయని రైతుల్ని మోసాలు, అబద్ధాలతో బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి మోసగించాలని చూడటం సిగ్గుచేటు. తనదికాని, తనుచేయని, రాష్ట్రప్రభు త్వానికి అసలేమాత్రం సంబంధంలేని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల్ని తానే ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం సిగ్గుచేటు…తీవ్ర అవమానకరం కూడా.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎంతమంది అన్నదాతలకు రైతుభరోసా నిధులిస్తుందో, ఎందరికి పీఎం కిసాన్ నిధులు వస్తున్నాయో ముఖ్యమంత్రికి తెలుసా?
ఒకనెలలో తమప్రభుత్వం 50 లక్షలమందికి రైతుభరోసా నిధులిచ్చిందని, మరోనెలలో 52లక్షలమందికి ఇచ్చామని ము ఖ్యమంత్రి చెబుతున్నాడు. కానీ వాస్తవంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంకింద రాష్ట్రంలో కేవలం 36.70లక్షల మంది రైతులకుమాత్రమే కేంద్రప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. అంతేమొత్తానికి ఏపీప్రభుత్వం కూడా తనవంతు వాటాగా ఇవ్వాల్సిన డబ్బుని ఇస్తోంది. కానీ ముఖ్యమంత్రి ఆయన పరివారం, పనికిమాలిన సాక్షిమీడియాలో మాత్రం 50లక్షల మందికి, 52లక్షలమందికి రైతురుణమాఫీ డబ్బులిచ్చినట్టు డబ్బాలు కొట్టుకుంటున్నారు.

జగన్ రెడ్డి నువ్వు..రైతుల బిడ్డవు అయితే ధాన్యం రైతుల్ని ఎందుకు దోచుకుంటున్నావు? కేంద్రం వరికిఇస్తున్న గిట్టుబాటుధరలో రాష్ట్రంలోని రైతులకు రూ.265లు తక్కువ ఇస్తున్నారు అన్న వైసీపీఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు?
మీబిడ్డ ప్రభుత్వం రైతులకు రూ.లక్షా45వేలకోట్లు ఖర్చుపెట్టిందని చెప్పడానికి జగన్ మన స్సాక్షికి, అతని సాక్షి మీడియాకు సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నాం. ధాన్యం రైతులనుంచి కొని, దానితాలూకా డబ్బులు, 6నెల్లకు, 7నెలలకు వారికిస్తే అదిరైతులకు సాయం చేయడం ఎలా అవుతుందో ఈపనికిమాలిన బిడ్డ సమాధానం చెప్పాలి. అలానే రైతులు పండించిన పంట ఉత్పత్తులు కొని, వాటికివ్వాల్సిన సొమ్ముచెల్లిస్తే, అదిరైతుకు ప్రభుత్వమిచ్చిన సాయమా? రైతులు కష్టపడి పండించిన ఉత్పత్తుల్ని కొని, వారికి ఏదో దయాదాక్షిణ్యంగా డబ్బులిస్తున్న ట్టు జగన్ మాట్లాడటం అన్నదాతల్ని వంచించడంకాదా? ఏపీలో ధాన్యంకొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని మోసగిస్తోందని, ధాన్యంకొన్నవెంటనే వారికి డబ్బులు ఇవ్వడంలేదని, కేంద్రంప్రకటించిన గిట్టుబాటుధర కూడా అన్నదాతలకు అందడంలేదని అధికారపార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసే చెప్పారు. ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్ధతుధరలో రూ.265లు ఏపీరైతులు కోల్పోతున్నారని చెప్పాడు. ఈ విధంగా వైసీపీప్రభుత్వం రైతుల్ని దోచుకుంటు న్న తీరుపై మాట్లాడకుండా, ముఖ్యమంత్రి నిన్నటిసభలో పదేపదే అబద్ధాలు చెప్పాడు.

ముఖ్యమంత్రి అయితే ప్రతిరైతుకి రూ.19,500లు ఇస్తానన్న జగన్, ఇప్పుడుకేవలం రూ.7,500లు ఇవ్వడం రైతాంగాన్ని వంచించడం కాదా?
తాను అధికారంలోకివస్తే, రాష్ట్రంలోని రైతులందరికీ రైతుభరోసాకింద ప్రతిరైతుకి, కేంద్రం ఇచ్చేసొమ్ముతో కలిపి రూ.19,500 ఇస్తానన్న జగన్ రెడ్డి ఇప్పుడు కేవలం రూ.7,500లు మాత్రమేఇస్తూ వారిని వంచిస్తున్నాడు. అలానే రైతుల సంఖ్యను తొలుత 69లక్షలమంది అని, తరువాత 50లక్షలకు కుదించాడు. రాష్ట్రంలో 15లక్షల మంది కౌలురైతులుంటే, కేవ లం లక్షా46వేలమందికి మాత్రమే రైతురుణమాఫీ సొమ్ముఇస్తున్నాడు. అలానే సున్నావడ్డీ కింద రైతులకు రూ.4వేలకోట్ల రుణాలు ఇస్తానని చెప్పిన జగన్ , ఇప్పుడురైతులు రుణాలు కట్టాక వారికి వడ్డీసొమ్ము చెల్లిస్తామని మెలిక పెట్టాడు. టీడీపీప్రభుత్వం మాత్రం సున్నావడ్డీ అంటే సున్నావడ్డీని కచ్చితంగా అమలుచేసింది. నిన్నతెనాలిలో బటన్ నొక్కి రైతులకు రూ.1090కోట్లు చెల్లించానన్న జగన్ మాటలు పచ్చి అబద్ధాలు అనడానికి నేటికీ రైతుల ఖాతాకు డబ్బు జమకాకపోవడమే నిదర్శనం.

చంద్రబాబు వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నిర్లక్ష్యంచేస్తే టీడీపీప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ వృద్ధిరేటు 11.23శాతానికి ఎలా చేరింది జగన్ రెడ్డి?
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు జరిగిననష్టం, రాష్ట్రంలో సంభవించిన రైతుల ఆత్మ హత్యలు రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేవన్నది పచ్చినిజం. 2014-19 మధ్యన దేశంలో వ్యవసాయవృద్ధిరేటు 7.86ఉంటే, రాష్ట్రంలో 11.23శాతం నమోదైంది. రాష్ట్ర వ్యవసాయవృద్ధి రేటుని రెండంకెలకు చేర్చిన ఘనత చంద్రబాబుది. వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆయన నిర్ల క్ష్యంచేస్తే, రెండంకెల వృద్ధిరేటు సాధ్యమయ్యేదా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. రైతులకు పెట్టుబడిసాయం, వడ్డీలేని రుణాలు, పంటలబీమా సొమ్ము, పంటలఉత్పత్తుల కొనుగోళ్ల తా లూకా సొమ్ము సకాలంలో ఇవ్వడం, ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లువేసి, ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, రూ.4,008కోట్లు పంటలబీమాసాయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలనుంచి రైతులకు అందించడం వరకు చంద్రబాబు హాయాంలో క్రమంతప్పకుండా జరిగాయి. మిరప, వరి, శనగ పంటలకు గిట్టుబాటుధరలేకపోతే, చంద్రబాబు హాయాంలో టీడీపీప్రభుత్వం బోనస్ ఇచ్చి, రైతుల్ని ఆదుకుంది. చంద్రబాబుహాయాంలో సాగునీటిప్రాజెక్టులకు రూ.64వేల కోట్లు ఖర్చుపెట్టారు జగన్ రెడ్డి. నువ్వ అధికారంలోకి వచ్చాక రైతులకు విత్తనాలు, ఎరువు లు కూడా దొరకని దుస్థితి. ఏపంట వేయాలో తెలియక, వేసిన పంటకు గిట్టుబాటుధరలేక జగన్ జమానాలో రైతులు అల్లాడారు. రైతుభక్షక కేంద్రాల్లో ప్రకటనలు, రైతులకుచేస్తున్న సాయం వివరాలన్నీ బూటకాలుగా మారాయి. తనప్రభుత్వం రూ.6,681కోట్లు రాష్ట్రరైతాంగా నికి పంటనష్టపరిహారం సాయం చేసిందంటున్న జగన్ రెడ్డి, ఏబీమాకంపెనీ నుంచి ఆసాయం అందిందో ప్రజలకు చెప్పాలి. 2022జూన్ 14న సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో చెన్నేకొత్తపల్లిలో జగన్ రెడ్డి ఆర్భాటంగా రూ.2,917కోట్లు పంటనష్టపరిహారం సాయాన్ని విడుదలచేశాడు. ఆనాటినుంచీ ఆసొమ్ము ఇప్పటికీ రైతులకు అందలేదు. అందితే ఎందరురైతులకు ఎప్పుడు ఆ సొమ్ము వారిఖాతాల్లో జమ అయ్యిందో ముఖ్యమంత్రి బహిర్గతంచేయాలి. జగన్ రెడ్డి జమా నాలో రైతుల్లో ఎవరికి డబ్బులు పడుతున్నాయో వారికే తెలియని దుస్థితి.

రైతులపై, వ్యవసాయంపై జగన్ కు ప్రేమాభిమానాలుంటే వ్యవసాయమోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నాడు? ధాన్యంసొమ్ము సకాలంలో ఎందుకు చెల్లించలేకపోతున్నాడు.. రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్ట్ లను ఎందుకు పూర్తిచేయడంలేదు?
జగన్ రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో మరీముఖ్యంగా రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీప్రభుత్వం, జగన్ రెడ్డి రైతుల్ని ఉద్ధరిస్తే, క్రాప్ హాలిడేలు ఎందుకు ప్రకటి స్తున్నారు? ప్రతిఏటా రాష్ట్రంలో రబీ, ఖరీఫ్ సీజన్లలో కోటి10లక్షల మెట్రిక్ టన్నులధాన్యం ఉత్పత్తి అవుతుంటే జగన్ ప్రభుత్వం కొంటున్నధాన్యం ఎంత? కొన్నధాన్యానికి జగన్ ఎప్పుడు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు. 2022 రబీలో(మే, జూన్ లో) సేకరించిన ధాన్యం తాలూకా డబ్బులు నేటికీ రాష్ట్రరైతాంగానికి జగన్ చెల్లించలేదు. అదేనా జగన్ రెడ్డికి రైతులపై ఉన్న ప్రేమ..అభిమానం? అప్పులకోసం ప్రపంచబ్యాంక్ నిబంధనలకు తలొగ్గిన జగన్ రెడ్డి రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడు. అదేనా అతనికి రైతాంగంపై, వ్యవసాయం పై ఉన్నప్రేమ? సున్నావడ్డీ కింద టీడీపీప్రభుత్వం గతంలో రూ.3లక్షలరుణాన్ని 25పైసలకు రైతులకు అందిస్తే, జగన్ రాగానే దానికి సున్నాచుట్టాడు…అదేనా అతనికి రైతులపై ఉన్న ప్రేమ? టీడీపీప్రభుత్వం రైతురుణమాఫీ కింద, అన్నదాతాసుఖీభవ కింద రైతులకు రూ.9వేల కోట్లు ఇవ్వడానికి జీవోలుఇస్తే, ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని జగన్ రద్దుచేశాడు. అదేనా ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ?

2024 ఎన్నికల్లో వార్ వన్ సైడే జగన్.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని నువ్వు..నీ అబద్ధాలు, మోసాలు ఆపలేవు
రైతుని రాజుగా చూడాలని, వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని తపించిన వ్యక్తి చంద్రబా బు మాత్రమే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచింది టీడీపీప్రభుత్వమే. అలాంటి నాయకుడికి బహిరంగ సవాళ్లు విసిరే స్థాయి జగన్ కు లేదు. 175 నియోజకవర్గా ల్లో పోటీచేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకి ఉన్నాయి జగన్ .. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే, నీకుభయంలేకపోతే నిన్న తెనాలిలో ఆరకంగా కేకలు పెట్టి, పెద్దపెద్దగా అరవవు. 202 4 ఎన్నికల్లో నీ పార్టీకోసం ఎన్నికల్లో పనిచేయడానికి నీపార్టీ శ్రేణులు సిద్ధంగా లేవని తెలుసుకో జగన్. 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిందని నీకుతెలిసే..నువ్వు ఇప్పటికీ అబద్ధా లు, మోసాలతో ప్రజల్ని వంచించాలని ఆరాటపడుతున్నావు. తెనాలిలో జగన్ చేసిన ప్రసం గం అంతా ఉత్తరకుమార ప్రగల్భాలేనని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని అతని తల్లి, చెల్లే ఇష్టపడటంలేదు” అని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.

Leave a Reply