టీడీపీ యువనాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన “గెలుపు మనదే” 2024 నూతన సంవత్సరం డైరీనీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల్లో వల్లూరు కిరణ్ చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది డైరీ విడుదల చేయటం అభినందనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, అందుకుగాను తాను రూపొందించిన డైరీకి “గెలుపు మనదే” అని శీర్షిక పెట్టినట్లు వల్లూరు కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు టీ.డీ జనార్ధన్, వర్ల రామయ్య, దారపనేని నరేంద్ర, పాతర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.