రైతుల కన్నీరును తుడవండి

పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి

మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి కేంద్రం నుంచి వచ్చిన బృందం ఉమ్మడి తిరుపతి జిల్లాలో పర్యటించి నేలకొరిగిన పంటలను పరిశీలించటంతో పాటు రైతులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన బృందాన్ని టీడీపీ నేతలు కలిసి దగ్గరుండి వారికి రైతులకు జరిగిన నష్టం వివరాలను వారికి వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకొని రైతాంగాన్ని కాపాడాలని కేంద్ర బృందాన్ని టీడీపీ నేతలు కోరారు.

గూడూరు నియోజకవర్గానికి వచ్చిన కేంద్ర బృందాన్ని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ నెలల సుబ్రహ్మణ్యం కలిసి రైతులను ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.

గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో పర్యటించిన కేంద్రం బృందాన్ని మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వాకాడు మండలం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, కృష్ణ మూర్తి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు కలిసి మిచౌంగ్ తుపాను బీభత్సానికి రైతులు పడుతున్న ఆవేదనను వారికి వివరించి రైతులను ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.

Leave a Reply