Suryaa.co.in

Andhra Pradesh

సీనియర్ జడ్జీల మాటలను వక్రికరించడం భావ్యం కాదు

– మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు

సీనియర్ జడ్జీల మాటలను వక్రీకరించడం భావ్యం కాదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడిన మాటలు …

కొన్ని పత్రికలు, ఛానళ్లు దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. ఓ నీలి పత్రిక కోర్టు తీర్పుల్ని కూడా వక్రికరించి రాస్తోంది. సీనియర్ జడ్జిగారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి రాస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. చంద్రబాబుపై మోపబడిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వైసీపీ నాయకులు ఐదేళ్లలో 5 పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. ఏఏపీ పొన్నవోలు సుదాకర్ రెడ్డి తన అడ్వకేట్ జనరల్ పోస్టును మరచి వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు.

ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఇక నైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజకీయాలు మానాలి. వైసీపీ ఏఏజీ పోస్టుకు ఉన్న విలువలను దిగజారుస్తోంది. పొన్నవోలు సుధాకర్ కుల పిచ్చి, పార్టీ పిచ్చి, జగన్ పిచ్చితో మాట్లాడుతున్నాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు, సుప్రీం కోర్టు మాటలను సాక్షి పత్రిక, సాక్షి మీడియా వక్రికరించి ప్రచారం చేస్తున్నాయి. సీఐడీ, ఏఏజీ, జగన్, జగన్ టీం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.

సాక్షి పత్రిక కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి రాయడం బాధాకరం. స్కిల్ డెవలప్ మెంటు కేసులో మొదట రూ.3,300 కోట్లు అవినీతి అన్నారు, ఆ తర్వాత రూ. 317 కోట్లన్నారు ఆఖరికి 27 కోట్లు పార్టీ ఖాతాలోకి వెళ్లాయని అబద్ధపు ప్రచారం చేశారు. ఇవిషయంలో సాక్షి తన ఇష్టారీతిన రాసింది. 20 నెలలుగా కోర్టుకు మీరు ఎందుకు ఆధారాలు చూపలేకపోయారు? ఎందుకు దేన్ని కూడా నిరూపించలేకపోయారు. ఇప్పటికైనా పొన్నవోలు సుధాకర్ కు సాక్ష్యాలు చూపే ధైర్యముందా?

మేం 17ఏ మీద క్యాష్ పిటిషన్ వేశాం. ప్రభుత్వం అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీం కోర్టుకు సాక్ష్యాలను చూపించలేకపోయారు. దీంతో వైసీపీ ప్రభుత్వపు డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడ్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేబినెట్ అప్రూవల్ చేసినదాన్ని తప్పు అన్నారు. సీఐడీ, వైసీపీ ప్రభుత్వం ఏఏజీ పొన్నవోలు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబుపై కేసులు వేశారు.

సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి గారు జగన్ రెడ్డి సీఐడీ వాదనను తిరస్కరించింది. 17ఏ వర్తిస్తుందని తీర్పు చెప్పింది. చంద్రబాబుపై పెట్టిన అక్రమకేసుల్లో దేనికీ కూడా సీఐడీ ఆధారాలు చూపలేకపోయిందని, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు మాజీ సీఎంకు ఎలా ఆపాదించారని బెయిలు మంజూరు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబుపై వేసిన కేసును విజయమ్మ ఉపసంహరించుకుంది.

ప్రధానంగా ఆధారాలు చూపలేనందుననే కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. అవి అక్రమ కేసులైనందున చంద్రబాబుపై జగన్ రెడ్డి తాను, తన తండ్రి ప్రభుత్వాలు పెట్టిన కేసులు న్యాయస్థానాల్లో నిలువలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డి జైలుకు పోకుండానే అతనికి బెయిల్ వచ్చింది. కోడికత్తి శీను కేసులో జగన్ రెడ్డి ఐదేళ్ల నుండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా అతన్ని జైల్లో మగ్గబెడుతున్నారు. ఇదంత జగన్ ఆడిస్తున్న ఆట.

గతంలో ఏ నాయకుడికి లభించని మినహాయింపులు జగన్ రెడ్డికి ఎలా వచ్చాయి? 38 కేసుల్లో 3,500 వాయిదాలు జగన్ రెడ్డి పొందగలిగాడు. ఇంత తక్కువ కాలంలో రూ.43 వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీం కోర్టు ప్రశ్నించడంకూడా జరిగింది. 2004లో హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముకొనే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం నేడు రూ.4 లక్షల కోట్లకు ఎలా ఎగబాకింది? ఈ రేంజ్ లో పెరిగిన మరో ముఖ్యమంత్రి ఎవరూ దేశంలో లేరు.

కుంభకోణాల్లో, హత్యా నేరాల్లో, అబద్ధాల్లో, మేనేజ్ మెంట్ లో జగన్ ను మించినవారు మరెవరూ లేరనేది కొండంత నిజం. తన అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పడం జగన్ నైజం.సాక్షి మీడియా అబద్ధాల ప్రచారం ఇకనైనా మానాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు.

LEAVE A RESPONSE