ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు.

అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత  తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.

సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a Reply