నాకు కంటివెలుగులో చికిత్స చేయిస్తారట..

-ఉద్యోగాలు వచ్చాయా ?
-డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చాయా?
-రుణమాఫీ అయ్యిందా ?
-మహిళకు వడ్డీ లేని రుణాలు వచ్చాయా ?
– ఈటల రాజేందర్

హస్తినాపురం డివిజన్లో బీజేపీ కార్నర్ మీటింగ్ సమావేశానికి హాజరైన ఈటల రాజేందర్, రంగరెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ గౌడ్, హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు నరేష్ యాదవ్. ఇక్కడ ఉన్న పేదలు బంజారాహిల్స్ లో ఇల్లు కావాలి అని అడగడం లేదు. ఉండే జాగాలో ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. వారిది గొంతెమ్మ కోరిక కాదు. మీరు చెప్పిందే అడుగుతున్నాం అని పేదలు అంటున్నారు. కెసిఆర్ వీరికి సమాధానం చెప్పాలి. కట్టుకున్న ఇళ్లకు హక్కులు కలుస్తామని జీవో నంబర్ 58, 59 తెచ్చారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పటి ధరప్రకారం డబ్బులు చెల్లించాలి అంటే ఎలా కెసిఆర్ గారు. చిన్న చిన్న ఇళ్లకు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మా భూములకు మాకు పట్టాలు ఇవ్వండి అంటే లక్షల రూపాయలు అడిగితే ఎలా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు.

పేదలకు వెంటనే 125 గజాల భూమి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న. DH కాలనీలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టి అందరికీ బస్సులు పెట్టీ చూపించారు. కానీ ఎనిమిదేళ్లుగా ఒక్క ఇల్లు అన్నా పేదవారికి ఇచ్చారా ? కట్టిన ఇల్లు చూపించి ఇప్పిస్తామని బ్రోకర్లు డబ్బులు వసూలు చేయడం సిగ్గు అనిపించడం లేదా ?
బండ రావిరాల బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చెయ్యాలి. 20 ఏళ్ల క్రితం కొనుక్కున్నారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం భూమి అని గుంజుకుంటున్నారు. వారికి మేము అండగా ఉన్నాం. పేదల జోలికి వస్తె మాడి మసి అవుతారు.మునుగోడు ఎన్నికల సందర్భంగా ఏల్బినగర్ లో ఉన్న మునుగోడు ఓటర్ల కోసం కేటీఆర్ వచ్చి జీఓ నంబర్ 118 ఇచ్చారు. ఓట్లు వేయించుకున్నారు మర్చిపోయారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా 118 జీఓను అమలు చెయ్యాలి.

ఎప్పుడో ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇచ్చిన భూములని కంపెనీల పేరుతో ఇప్పుడు గుంజుకుంటున్నారు. ఎకరం జాగాకి 121 గజాలు ఇచ్చి ఆ భూమి అమ్ముకుంటున్న లాండ్ బ్రోకర్ కెసిఆర్. ప్రైవేట్ దావాఖానలో చికిత్స చేయించుకుంటే లక్షల రూపాయల అప్పులు మిగులుతున్నాయి. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. కంపెనీలలో పని చేసే వారికి జీతాలు పెంచే జీఓ ఇవ్వడం లేదు. జీతాలు పెంచడం లేదు. కానీ లిక్కర్ సీసా తెలంగాణ వచ్చినప్పుడు 60 రూపాయలు ఉంటే ఈ రోజు 200 అయ్యింది. మేము చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అని కెసిఆర్ గారు అంటారు.. పైగా నాకు కంటివెలుగులో చికిత్స చేయిస్తారట.. ఉద్యోగాలు వచ్చాయా ? డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చాయా? రుణమాఫీ అయ్యిందా ? మహిళకు వడ్డీ లేని రుణాలు వచ్చాయా ?

పన్నులు కడుతున్న మేము బిచ్చగాళ్ల అయ్యాం.. నువ్వేమో ఓనర్ అయ్యావు అని ప్రజలు అంటున్నారు. కెసిఆర్ అన్నీ నేనే ఇస్తున్న అంటున్నాడు. నరేంద్ర మోడీ గారు ఏనాడూ కూడా నేను ఇస్తున్న అని చెప్పరు. హైదరాబాద్లో పనులు చెయ్యడానికి కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు హత్యలు చేసుకుంటున్నారు. మీ ఆశీర్వాదం పొంది బీజేపీ వస్తే.. ఇళ్ళ జాగలకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టి ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల సభలు పెట్టీ కెసిఆర్ ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నాం. ప్రజలారా అలోచన చేయండి. ఎవరి ఆస్తులు పెరిగాయి, ఎవరి బ్రతుకులు ఆగం అవుతున్నాయి చూడండి అని ఈటల రాజేందర్ అన్నారు.

Leave a Reply