Home » వెల్లంపల్లి శ్రద్ధంతా కొబ్బరి చిప్పలు అమ్ముకోవడం..ఆలయభూములు కబ్జాపైనే

వెల్లంపల్లి శ్రద్ధంతా కొబ్బరి చిప్పలు అమ్ముకోవడం..ఆలయభూములు కబ్జాపైనే

– నవరాత్రుల్లో దుర్గమ్మ దర్శనానికివచ్చిన భక్తులను ప్రభుత్వం గాలికొదిలేసింది
– మంత్రి వెల్లంపల్లి జగన్ పూజలో మునిగి, సామాన్యభక్తులకు అమ్మవారి దర్శనాన్ని దూరంచేశాడు.
– హిందూమత సంరక్షణపై, భక్తుల బాధలపై లేదు.
– రాష్ట్రంలో జరుగుతున్న హిందూమతవ్యతిరేక ఘటనలకు నైతికబాధ్యతవహిస్తూ, వెల్లంపల్లి తక్షణమే మంత్రిపదవికి రాజీనామాచేయాలి.
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్
విజయదశమి నవరాత్రులలో భాగంగా చివరిమూడురోజులు విజయవాడలోని దుర్గమ్మదర్శనానికి భక్తులు పోటెత్తారని, ఆ సమయంలో ఇందకీలాద్రిపై ఉన్న అమ్మవారి దేవాలయాన్ని ప్రభుత్వం అధికారపార్టీ రంగులదీపాలతో అలంకరించడం దురదృ ష్టకరమని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ ఆవే దన వ్యక్తంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
పురాణకాలంనుంచి ఎంతోపవిత్రమైన పరమ విశిష్టమైన ఇందకీలాద్రి పర్వతాన్ని ఈప్రభుత్వం వైసీపీ కార్యాలయంగా మార్చింది. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగవంటివి అందించకుండా, ఆఖరికి అమ్మవారిదర్శనంకూడా సరిగా కల్పించకుండా ప్రభు త్వం దారుణంగా వ్యవహరించింది. ప్రభుత్వం, అధికారులు వీఐపీల సేవల్లో మునిగితేలి సామాన్య భక్తులను నిర్లక్ష్యంచేస్తారా?
నవరాత్రుల సందర్భంగా రాష్ట్రనలుమూలల నుండి వస్తున్న భక్తులకు కనీససౌకర్యాలు కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అమ్మవారి దర్శనంకోసంవచ్చిన భక్తులు క్యూలైన్లలో చిన్నపిల్లలతో గంటలతరబడి వేచిఉండాల్సిన దుస్థితి కి ప్రభుత్వమే కారణం. నవరాత్రులని తెలిసీ, భక్తులు అధికంగా వస్తారనే ఇంగితంలేకుండా, ప్రభుత్వం వారికి కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు? కొబ్బరిచిప్పలు అమ్ముకోవడం, దేవాలయాల భూములను కబ్జాచేయడం మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా మంత్రి వెల్లంపల్లి భక్తుల ఇబ్బందులపై పెట్టిఉంటే, వారికి ఈదుస్థితి వచ్చేదికాదు. అమ్మవారి నామస్మరణతో మారుమోగాల్సిన దుర్గమ్మ సన్నిధి.. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిందంటే ఇంద్రకీలాద్రిపై పరిస్థితి ఎలాఉందో స్పష్టమవుతోంది.
అరకొర సౌకర్యాలు ఏర్పాటుచేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ పూజలో మునిగితేలుతూ, దుర్గమ్మదర్శనానికి వచ్చేవారి ఇబ్బందులను విస్మరించారు. హిందూమతం పట్ల మొదటి నుండీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. విజయవాడ కొండమీదకు వాహనాలు అనుమతించమని చెప్పినవారే, వందలాది వాహనాలను ఎందుకు అనుమతించారు? దేవాలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ స్క్రీన్స్ పై అన్యమత ప్రచారంచేశారు. భక్తులు ఆగ్రహం


వ్యక్తంచేసినా కూడా అన్యమతప్రచారదృశ్యాల ప్రసారానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోలేదు. గుడిచుట్టూ వైసీపీరంగులు ప్రస్ఫుటమయ్యేలా లైటింగ్ వైసి, ప్లెక్సీలు కట్టారు. పవిత్రమైన ఆలయాలవద్ద కూడా పార్టీప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు. దుర్మమ్మ సన్నిధిలో వైసీపీఉత్సవాలు నిర్వహిస్తున్నారో…. దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారో అర్థం కానివిధంగా ప్రభుత్వం, అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించారు.
మొన్నటికి మొన్న కలియుగ వైకుంటమైన తిరుమలలో జగన్ రెడ్డి రక్షకా గోవిందా అని టీటీడీ ఛైర్మన్ భార్యే దగ్గరుండీ మరీ నినాదాలు చేసింది… చేయించింది. రాష్ట్రంలోఉన్నవి ఆలయాలు అనుకుం టున్నారా.. లేక వైసీపీ కార్యాలయాలు అనుకుంటున్నారా? భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే చర్యలకు ప్రభుత్వం ఇకనైనా స్వస్తిపలికితే మంచిది. మన్ముందు ఇలాంటి మత వ్యతిరేక చర్యలకు పాల్పడితే పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తున్నాం. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి, అధికాపార్టీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ, ఈరోజు దర్శనం చేసుకోకపోతే నష్టమేమిటంటూ తూలనాడటం క్షమించరాని నేరం. గతంలో జరిగిన విగ్రహాలధ్వంసాన్ని పిచ్చివాళ్లచర్యగా చెప్పుకొచ్చినప్రభుత్వం, తరువాత స్వామివారి రథాలు తగలబడినా, నిందితులపై చర్యలుతీసుకోకుండా, విచారణలపేరుతో కాలయాపన చేసింది.
ప్రభుత్వవైఖరి, తీరు చూస్తుంటే, ఆదినుంచీ కావాలనే హిందూమతంపై, మత విశ్వాసాలపై కావాలనే దుష్ప్రచారం, ఎదురుదాడిచేస్తున్నట్లుగా ఉంది హిందూమతాన్ని కాపాడటం, ప్రజలుమెచ్చేలా వివిధరకాల ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వానికి చేతగా కుంటే, తక్షణమే హిందూసమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి, చేసినతప్పులు ఒప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా, అందరిమనోభావాలు గౌరవిస్తూ, ఎవరికీ ఎలాంటిఇబ్బందిలేకుండా పనిచేయడమనేది చంద్రబాబు నాయుడిగారికి, టీడీపీకి బాగా తెలుసును. రాష్ట్రంలో జరుగుతున్న హిందూమతవ్యతిరేక ఘటనలకు నైతికబాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
భక్తుల బాధలు, ఇబ్బందులు పట్టించుకోకుండా, అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి దర్శనంకూడా కల్పించలేని దుస్థితిలో మంత్రి ఉండటం సిగ్గుచేటు. మంత్రికి భక్తులకంటే జగన్ భజనే ఎక్కువైంది. ఇందకీలాద్రి దేవస్థానం మంత్రి నియోజకవర్గంలోని ప్రముఖ క్షేత్రం, అయినా అక్కడేం జరుగుతోందో కూడా పట్టించుకోలేని దుస్థితిలో ఆయన ఉండటం నిజంగాసిగ్గుచేటు. బ్రాహ్మణ ఆస్తులు ఆక్రమణపై తాము విచారించి, కారకులైన వారిపై చర్యలు తీసుకునేవరకూ ప్రభుత్వంపై ఒత్తిడితెస్తాము. రాష్ట్రంలో ఆక్రమణ లకు గురవతున్న బ్రాహ్మణులఆస్తులను కాపాడటానికి, బ్రాహ్మ ణులను ఆదుకోవడానికి, తమశక్తివంచనలేకుండా, రాష్ట్రంలోని హిందూసంఘాలు, స్వామీజీలు, పీఠాధిపతులతో కలిసి ప్రభుత్వం పై పోరాడతాము.

Leave a Reply