Suryaa.co.in

Andhra Pradesh

దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై లేదేం జగన్ రెడ్డీ?

*జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అంతర్జాతీయంగా దేశ, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినడంతో జగన్ రెడ్డికి ముఖం చెల్లక దావోస్ సదస్సుకి డుమ్మా కొట్టాడు
*పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య మొ. వారు దావోస్ సదస్సుకు హాజరై తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తేవటానికి తీవ్రంగా శ్రమిస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్జీ ఆటలో నిమగ్నమై ఉన్నాడు
*సూటు బూటు వేసుకొని దసరా బుల్లోడిలా షికార్లు కొట్టే మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రతినిధి బృందాన్ని దావోస్ తీసుకు వెళ్ళలేకపోయాడు
*గత ఐదు సంవత్సరాలుగా జగన్ రెడ్డి అసమర్ధత వల్ల విదేశీ పెట్టుబడుల విషయంలో మన రాష్ట్రం దారుణంగా నష్ట పోయింది
*విదేశి పెట్టుబడులు ఆకర్షించటంలో ఎంతగానో ఉపయోగపడే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఈ ఏడాది కూడా డుమ్మా కొట్టాడు సైకో జగన్
*గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే 2022లో దావోస్ సదస్సుకు హాజరై పెట్టుబడులు సాధించింది సూన్యం
*2022లో దావోస్ పర్యటన పేరుతో కుటుంబసభ్యులతో విదేశీ విహార యాత్ర చేశాడు జగన్ రెడ్డి
*2014-2019 మధ్య ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది చంద్రబాబు గారి సారధ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ సదస్సుకు హాజరై పెద్ద ఎత్తున విదేశి పెట్టుబడులను ఆకర్షించింది
-కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర బృందం గానీ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు.

ఆ వివరాలు ఆయన మాటల్లో…. సాధారణంగా ముఖ్యమంత్రులు వారివారి రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడం కోసం అధికారిక పర్యటనలు చేస్తూ ఉంటారు. కానీ, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క పర్యటనలో పాల్గొనలేదు. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఆకర్షించడం కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అతి ముఖ్యమైనది.

ప్రపంచ వ్యాప్తంగా సదస్సుకు విచ్చేసే పెట్టుబడిదారులకు తమ తమ దేశాలలోని వ్యాపార అవకాశాలను వివరించి వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ దేశాలను, రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తహతహలాడుతారు. దావోస్ సదస్సును ఎంతోప్రతిష్టాత్మకంగా తీసుకుని పెట్టుబడులు ఆకర్షించడం కోసం శాయశక్తుల పనిచేస్తారు.

1995-2004, 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు స్వయంగా అనేకమార్లు దావోస్ సదస్సులకు వెళ్లి అక్కడ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక పవీలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడులు ఆర్షించేందుకు ఎంతో శ్రమించారు. కానీ, తెలుగు ప్రజలు దురదృష్టం గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ ఏడాది మినహాయిస్తే దావోస్‌లో జరిగిన నాలుగు సదస్సులకు గాను మూడింటికి జగన్ రెడ్డి డుమ్మా కొట్టాడు.

సదస్సుకు హాజరైన ఏడాది కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే చిత్తశుద్ది ఆయనలో ఎక్కడా కనిపించలేదు. అదేదో ఒక విహారయాత్రలా సరదాగా వెళ్లి తిరిగి వచ్చారు. గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది.
చంద్రబాబు నాయుడు గారు 2015 జనవరిలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరై రాష్ట్ర పారిశ్రామిక విజన్ ఎలా ఉండబోతుందో స్వయంగా వివరించారు.

ఫోరం ప్రెసిడెంట్ క్లాస్ స్వాబ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి ‘భవిష్యత్ నగరీకరణ’పై మాట్లాడాలని కోరారు. చంద్రబాబు నాయుడr ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆహ్వానం ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఆ సదస్సులో మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ కోసం చంద్రబాబు నాయుడు తన విజన్‌ను సుస్పష్టంగా వివరించడం జరిగింది.

నాటి చంద్రబాబు నాయుడి కృషిని ఎకనామిక్ టైమ్స్ వారు సైతం తమ పత్రికల్లో ప్రచురించారు. మనుసటి సంవత్సరం 2016లో సైతం దావోస్ సదస్సులో పాల్గొని Mastering the Forth Industrial Revolution అన్న అంశంపై చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా,  నెస్లే, జాన్సన్,  సీమెన్స్, మెకంజీ, లాక్‌హీడ్ మార్టిన్ ఎయిర్ బస్, జెట్రో, ఊబర్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

2017 లో వరుసగా మూడవసారి సదస్సులో సైతం పాల్గొని పెట్టుబడుల కోసం చంద్రబాబునాయుడు ఎంతో శ్రమించారు. ఆయన కృషితో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో నంబర్ వన్ 1 గా నిలుస్తోందంటూ నాడు జాతీయ పత్రికలు కధనాలు ప్రచురించారు. 2018 లో నాలుగో ఏడాది సైతం చంద్రబాబు నాయుడు గారు హాజరై పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు.

2019 లో నాటి ఐటీ మంత్రి నారా లోకేష్  ఆంధ్రప్రదేశ్ బృందానికి నేతృత్వం వహిస్తూ దావోస్ సదస్సుకు హాజరై  అనేకమంది దిగ్గజ విదేశీ పారశ్రామికవేత్తలతో సమావేశం అవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే ఒక్క అవకాశం కూడా వదులుకోకుండా ఐదేళ్లు వరుసగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు హాజరవడం జరిగింది.

ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షించడం కోసం చేసిన పర్యటనల కారణంగా 2014-19 మధ్య రాష్ట్రానికి ఆకర్షించిన విదేశీ పెట్టుబడుల వివరాలు

1. 2014 -15 లో రూ. 8,326 కోట్లు
2. 2015-16 లో రూ. 10,315 కోట్లు
3. 2016-17 లో రూ. 14,767 కోట్లు
4. 2017-18 లో రూ. 8,037 కోట్లు
5. 2018-19 లో రూ. 23,882 కోట్లు
మొత్తం రూ.65,327 కోట్లు

2014-19 ఐదేళ్ల కాలంలో దేశం మొత్తం మీద వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో మన రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు వాటా 14.7 శాతం. చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల కారణంగా రూ.65,327 కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. కియా మోటార్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి.

కియా మోటార్స్ వారు వేరే ప్రాంతాల్లో తమ ప్లాంటు ఏర్పాటు చేసుకోవాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపద్యంలో సైతం చంద్రబాబు నాయుడు స్వయంగా దక్షిణ కొరియా వెళ్లి కియా మోటార్స్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారిని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది.

ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడి చిత్తశుధ్ధి. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లలో తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ.6,679 కోట్లు మాత్రమే. ఇది జాతీయ స్థాయిలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఒక్క శాతం కంటే తక్కువ.

జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగేళ్లు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగితే మూడుసార్లు డుమ్మా కొట్డాడు. దావోస్ సదస్సులకు జగన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. వెళ్లిన ఒక్క ఏడాది కూడా కొన్ని కోట్ల రూపాయలు తగలేసి దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ వెళ్లారు. దావోస్ వెళుతున్నానని చెప్పి లండన్ ఎందుకు వెళ్లాల్సివచ్చింది?

లండన్‌ వెళ్లిన జగన్ రెడ్డి తన  కుమార్తెలను తీసుకుని భార్యపిల్లలతో స్విట్జర్లాండ్‌లో విహారయాత్రలు చేశాడు. దీన్నిబట్టి జగన్ రెడ్డి దృష్టి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కాదని స్పష్టంగా అర్ధమౌతోంది. దావోస్ పర్యటనలో ఏ ఒక్క విదేశీ కంపెనీ సీఈఓ కూడా జగన్ రెడ్డి ముఖం చూసిన పాపాన పోలేదు. అది దావోస్‌లో జగన్ రెడ్డి ప్రాముఖ్యత.

జగన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన లబ్ది ఏమిటని అడిగితే వైకాపా మంత్రులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట కూడా వినకుండా ఎనర్జీ పీపీఏలు రద్దు చేయడంతో దావోస్ సదస్సులో నాటి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విదేశీ పెట్టుబడిదారుల ముందు తలదించుకోవాల్సిన దుస్థితి కల్పించారు.

జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంపై సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులు పీయూష్ గోయల్ గారిని నిలదీశారు. వైకాపా ప్రభుత్వం చేసిన ఎనర్జీ పీపీఏల రద్దుతో నాడు దేశ ప్రతిష్టే దెబ్బతిన్నది. పెట్టుబడులు తీసుకురాకపోగా దేశం, రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసిన వ్యక్తి జగన్ రెడ్డి. చేసుకున్న ఒప్పందాలను గౌరవించకుండా ఇష్టానుసారం రద్దుచేసే రాష్ట్ర ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీయూష్ గోయల్ గారు మాట్లాడారు.

అవసరమైతే ఆర్.బి.ఐ అలా వ్యవహరించిన రాష్ట్రాలకు నిధుల కోత విధించాలని సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదార్ పూనావాలా సైతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పీపీఏల రద్దును తీవ్ర చర్యగా అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వ చర్యలు పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని మాట్లాడారు.

జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ చర్యల కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను ప్రక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి దాపురించింది. ఏపీకి రావాల్సిన లులూ హైదరాబాద్‌లో అతిపెద్ద మాల్ కట్టారు. వెనుకబడిన జిల్లా ఒంగోలుకు రావాల్సిన ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమ జగన్ రెడ్డి కారణంగా పారియారు.

జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నుంచి కోట్లు తగలేసి ప్రత్యేక విమానంలో చేసిన ఘనకార్యం ఏమిటంటే దావోస్ వెళ్లి తన బినామీ కంపెనీయైన అరబిందోతో ఒప్పందం చేసుకోవడం. తన బినామీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి ఇక్కడ నుంచి దావోస్ వెళ్లాలా? గ్రీన్ కో, అదానీ గ్రీన్ ఎనర్జీ లాంటి దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికి కోట్లు రూపాయల ప్రజాధనం హెచ్చింది దావోస్ వెళ్లడం అవసరమా? సాధారణంగా అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటే విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి.

జగన్ రెడ్డి యొక్క వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారింది. పెట్టుబడులు రాక నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. పట్టభద్రులలో దేశంలో అత్యధికంగా నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా అందించిన సమాచారం మేరకు 2022లో జగన్ రెడ్డి జరిపిన ఏకైక దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పైసా కూడా పెట్టుబడి రాలేదన్న విషయం నిజం కాదా!

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య మొ. వారు దావోస్ సదస్సుకు హాజరై తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తేవటానికి తీవ్రంగా శ్రమిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం గడ్డి పీకుతుంది? జగన్ రెడ్డికి పబ్జీ ఆడుకోవటానికే సమయం సరిపోవటం లేదు. సూటు బూటు వేసుకొని దసరా బుల్లోడిలా షికార్లు కొట్టే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకని ఒక ప్రతినిధి బృందాన్ని దావోస్ తీసుకు వెళ్ళలేకపోయాడు.

భూ కబ్జా, ఇసుక దోపిడి, లిక్కర్ మాఫియా, మైనింగ్ లో ఎంత మింగుదాం, ప్రజలపై భారాలు, తప్పుడు కేసులు పెడదాం అనే ఆలోచనలు తప్ప రాష్ట్రానికి మంచి చేద్దామని జగన్ రెడ్డికి లేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో తిని తొంగోటం తప్ప ఏ సంవత్సరాన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కోట్ల రూపాయల ప్రజా ధనంతో ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా దావోస్ కు వెళ్ళకుండా లండన్ చేరుకొని తన సొంత వ్యవహారాలు చక్కబెట్టాడు.

జల్సాల కోసం ప్యాలెస్‌లు కట్టుకుంటాబుడు జల్సా రాయుడు. జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సుస్థిరపరిచే విధంగా చర్యలు తీసుకోకపోవడం  అత్యంత శోచనీయం. అందుకే సైకో పోవాలి సైకిల్ రావాలని ప్రజలంటున్నారు. జగన్ రెడ్డి చేసిన నిర్వాకం వల్ల ఇదేం ఖర్మ మన రాష్ట్రానికని బాధపడుతున్నారు. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలు దావోస్ లో పోటీపడుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో మొద్దు నిద్రపోతున్నాడు.

 

LEAVE A RESPONSE