ఆడవాళ్ల వ్యక్తిత్వహననానికి పాల్పడటానికేనా ప్రజలు గెలిపించింది?

-ఆడవాళ్ల వ్యక్తిత్వహననానికి పాల్పడటానికేనా జగన్ రెడ్డి, ఆయనపార్టీ వారిని ప్రజలు గెలిపించింది?
– తన వ్యక్తిత్వాన్ని కించపరిచిన వైసీపీ ఎమ్మెల్యే తన తల్లి, భార్య, కూతురి వ్యక్తిత్వాల గురించి కూడా హేళనగా మాట్లాడగలడా?
• మహిళలను కించపరుస్తూ వారివ్యక్తిత్వాలను దిగజారుస్తూ మాట్లాడే ప్రతి ఒక్కరికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే బడితపూజే
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు

జగన్ రెడ్డి పాలనలో మహిళలకు జరుగుతున్న అవమానాలు, వెతలు, వేధింపుల గురించి ఎంతలా ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి అర్థమయ్యేలా చెప్పాలనిచూస్తున్నా, అధికారంలో ఉన్నవారు అహంకారంతో, మదంతో తాముచేసేది, చెప్పేదే సరైంది అన్నట్లు గామాట్లాడుతున్నారని, మహిళాదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిసహా, వైసీపీనేతలంతా మాట్లాడింది విన్నవారెవరైనా తాముచెప్పినదానితో ఏకీభవించాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళరాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టంచేశారు.బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …

మహిళలను గౌరవించే విషయంలో జగన్మోహన్ రెడ్డికే సంస్కారం లేవని ఇన్నాళ్లుభావించాము.కానీ నిన్న ప్రభుత్వఆధ్వర్యలో జరిగిన మహిళాదినోత్సవకార్యక్రమంలో అధికారపార్టీనేతలు, మహిళామంత్రులు మాట్లాడింది చూస్తే వారికి కించిత్ కూడా స్త్రీలపై సదభిప్రాయంలేదని అర్థమైంది.

తాను నెల్లూరులో నారీసంకల్పదీక్ష కార్యక్రమంలో మాట్లాడి వచ్చిన తర్వాత, అక్కడుండే ఒక ఎమ్మెల్యేకి నోటిదురద ఎక్కువైంది. తనతండ్రి పలుకుబడితో, టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన సదరుప్రబుద్ధుడికి మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లుదగ్గరపెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. తనకుతాను రాజకీయధీరుడినని చెప్పుకునే సదరు సోకాల్డ్ వైసీపీఎమ్మెల్యేకి గుర్తింపుపిచ్చి పరాకాష్టకుచేరింది. ఆ క్రమంలో తన ఇంట్లోని తల్లిని, భార్యని దూషించి, వారి వ్యక్తిత్వాన్ని కూడా కించపరచడానికి వెనుకాడడు. అధికారంలోఉండి మహిళల్నిగౌరవించలేని ఇలాంటి పశుప్రవృత్తికలిగిన వారికి మనుషులుగా బతికే అర్హతఉందా అనిప్రశ్నిస్తున్నాం.

ఒకతల్లి కడుపునపుట్టే అర్హతకూడా లేదు. నాగురించి అసభ్యంగా మాట్లాడిన సదరు సోకాల్డ్ వైసీపీఎమ్మెల్యేకి ఒకటేచెబుతున్నాను. తనతల్లి, భార్యవ్యక్తిత్వం ఎలాంటివో, నాదికూడా అలాంటివ్యక్తిత్వమే. నా వ్యక్తిత్వం గురించి సదరుఎమ్మెల్యే మాట్లాడే ముందు, తనభార్య, తనతల్లి, తనకూతురుముందు ముందు ఎంతలాక్షోభపడాల్సివస్తుందో సదరు వ్యక్తి ఆలోచించుకుంటే మంచిది. నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత మంచిపేరుందో… ఆయనకడుపున పుట్టిన వ్యక్తి అంతసిగ్గులేని విధంగా తయారయ్యాడు. తనతల్లిని ప్రశ్నిస్తున్నాను…ఏంటమ్మా నీ కుమారుడిని ఇలాపెంచావని?

తనరాజకీయపునాది ఇప్పటికీ టీడీపీపునాదే అనే వాస్తవాన్ని సదరు వైసీపీఎమ్మెల్యే గుర్తించాలి. టీడీపీ పునాదిపై రాజకీయ జీవితాన్ని నిర్మించుకుంటూ చంద్రబాబు చావునికోరతావా? అక్కడే నీ వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతోంది. నీ వ్యక్తిత్వానికి, నా వ్యక్తిత్వానికి నక్కకు, నా గలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ నియోజకవర్గంలోని పొలాలకు, చెరువులకు నీళ్లివ్వాలంటే ప్రజల వద్ద కప్పం వసూలుచేస్తున్నావు.. అదీ నీ క్యారెక్టర్. హైదరాబాద్ లో ఎవరిఇళ్లను ఆక్రమించుకొని, ఎవరికి అమ్మేశావో తెలియదా మిస్టర్ సోకాల్డ్ ఎమ్మెల్యే? గ్రావెల్ తవ్వకాలు మొదలు, లేఅవుట్ల యజమానులనుంచి వసూలుచేసే కమీషన్లవరకు నీవీరత్వం, ధీరత్వం అందరికీ తెలుసు.

పోలీసులు, అధికారులను కించపరుస్తూ, మేంఅధికారంలోఉన్నాము..ఏం పీక్కుంటారో పీక్కోండని అన్నావు.. అదీ నీ వ్యక్తిత్వం. నేను జిల్లా ఎస్పీకి ఆయన బాధ్యతగుర్తుచేస్తే, నువ్వు అదే ఎస్పీని దూషించావు. ఎస్పీని అనరాని మాటలు అన్నందుకు ఆయన నీ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకొని తక్షణమేకేసు నమోదుచేయాలి. నన్ను అన్నందుకు ఎమ్మెల్యేపైకూడా అట్రాసిటీకేసు పెట్టాలికదా?
మిస్టర్ఎమ్మెల్యే నువ్వు నిజంగా వీరుడివి.. ధీరుడివి అయితే నెల్లూరుజిల్లాలో విదేశీయువతిపై జరిగిన అత్యాచారయత్నం గురించి మాట్లాడు. అదేజిల్లాలో ఒకమహిళను దారుణంగా హత్యచేసి తగలబెట్టినదానిపై మాట్లాడు.

మేం మాఒంటిపై బట్టలుఎలాఉన్నాయో చూసుకోకూడదా? ఒక మహిళ తనగోడు వెళ్లబుచ్చుకోవడానికి పోలీసులవద్దకు వెళ్తే ఆమె ఒంటిపై గుడ్డలుఉన్నాయో లేవో కూడా చూడకుండా ప్రవర్తిస్తారా? ఆ అమ్మాయికి జరిగిన అవమానం గురించి మాట్లాడానని నన్ను అంటారా?మీరు ఏంచేస్తున్నా.. మహిళలను దూషిస్తూ, హింసిస్తున్నా చూస్తూఊరుకోవాలా? మద్యపాన నిషేధం పేరుచెప్పి, రాష్ట్రంలోని మహిళల తాళిబొట్లు తెంపేస్తున్న మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటంచేతగాదు.. నువ్వు ఒక ఎమ్మెల్యేవి? నా కొడకల్లారా.. ఆడవాళ్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఇంకోసారి మీకు బడతెపూజ ఖాయం.

మీరు.. మీ బతుకులు..నిన్న మీ ప్రభుత్వం నిర్వహించిన మహిళాదినోత్సవం అసలుమహిళా దినోత్సవమేనా? మహిళలను ఈ మూడేళ్లలో ఏంఉద్ధరించారో, వారికి ఏం ఒరగబెట్టారో చెప్పకుండా చంద్రబాబుని, లోకేశ్ ని, అచ్చెన్నాయుడి గారిని హేళన చేస్తారా? అదేనా మహిళాదినోత్సవం నాడుమహిళలుగా పుట్టినవారుచేయాల్సిన పని?

ఇతరులను దూషిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ మీ ముఖ్యమంత్రికి శునకానందం కలిగిస్తారా? నిన్న మీ ముఖ్యమంత్రి స్టేజ్ పై ఉండగానే నెల్లూరులో విదేశీయువతిపై అత్యాచారయత్నం జరిగింది. కానీ దానిపై బహిరంగంగా మాట్లాడే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదు. అదే సమయంలో పలాసలో ఒక మహిళతాళిని మీ పార్టీ నాయకుడు ఒకడు తెంచేశాడు. మీరుఅనేప్రతి మాటకు సమాధానంచెప్పే తీరుతాం.

రాబోయేది చంద్రబాబు ప్రభుత్వం. ఆప్రభుత్వం రాగానే ఆడబిడ్డలగురించి హేళనగా మాట్లాడిన ప్రతి ఒక్కడికీ, ప్రతిమహిళకు ఏకంగా సీన్ సితారే.. అది బాగా గుర్తుంచుకోండి. మీకు, మీ ముఖ్యమంత్రికి బాగా భయంపట్టుకుంది. గతంలోసినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని కూడా నెల్లూరుజిల్లా సోకాల్డ్ వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది..ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో. చంద్రబాబుగారిని గెలిపించేంతవరకు, ప్రతిమహిళనుకలుస్తాం.. ప్రతిఇంటి గడప తడతాము. నేను నెల్లూరులో మాట్లాడినప్పుడు కొందరుఎమ్మెల్యేల గురించి, వారి అనైతిక కార్యక్రమాల గురించి మాట్లాడాను.

ఆజాబితాలో ఇప్పుడు బలిసి కొట్టుకుంటున్న సోకాల్డ్ ఎమ్మెల్యే ఉన్నాడని నాకు తెలియదు. మాపార్టీ నేత అయ్యన్నపాత్రుడు గారు ఇదివరకే ఒకసవాల్ విసిరారు. దానిప్రకారం మహిళా సంక్షేమంపై, మహిళా సాధికారతపై బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమే. అదికూడా మీ బురదపత్రిక ఆఫీసులోనే చర్చిద్దాం. చర్చకు వస్తారా? మీ ముఖ్యమంత్రికి ఎంతధైర్యముందో తెలియాలంటే పోలీస్ పహారాలు, పరదాలులేకుండా అమరావతిలోని మహిళల మధ్యనుంచి అసెంబ్లీకి వెళ్లమని ఇదివరకే చెప్పాము. అలా వెళ్లగలడా? మీనాయకుడికి ఎంత భయంఉందో అక్కడే అర్థమవుతోంది. అంతకంటే ఎక్కువభయం మీలోఉండబట్టే మీరు నోటికి వచ్చినట్లు వాగుతున్నారు.

జబర్దస్త్ ప్రాస చూపించడం కాదు.. ఆమెకు నిజంగా ధైర్యముంటే ఆమెకూడా అమరావతి మహిళలమధ్యకువచ్చి మహిళాసంక్షేమంపై మాట్లాడాలి. లేదంటే ఆమె ఎక్కడికి రమ్మంటే నేనే అక్కడకు వెళతా..ఆమె వస్తుందో లేదో చెప్పాలి. ఆమె అచ్చెన్నాయుడి గురించి మాట్లాడింది… ఈసారి ఆమెనగరిలో గెలుస్తుందా? ప్రజలు గెలిపించారు కదా.. అనిఇష్టానుసారం మాట్లాడితే ఎక్కడ,ఎప్పుడు ఏదితీసేయాలో మాకు బాగాతెలుసు.

Leave a Reply