Suryaa.co.in

Political News

కరవు కుప్పంలో అభివృద్ధి పంటలు వేసిన చంద్రబాబు

– ఇజ్రాయిల్ టెక్నాలజీతో మారిన రైతువ జీవనం
– దేశానికి విస్తరించిన కుప్పం నర్సరీ పూలగుత్తులు

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం,
రెండు వైపుల కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని బంగారుపేట ప్రాంతం ,
మరో వైపు తమిళనాడులోని అంబూర్ ప్రాంతం,
తమిళ ప్రబావం ఏక్కువ,ఎనబై శాతం బడుగు బలహీన వర్గాల ప్రజలే,
1989 పూర్వం కరువు సీమ,కనీసం దాహం తీర్చుకోవటానికి మంచినీళ్లు దొరకని ప్రాంతం,
నియోజకవర్గ వ్యవసాయం సంగతి సరేసరి,
కట్టుబాట్లు అచార వ్యవహారాలు తప్పక పాటించే ప్రాంతం,బహిష్టు స్త్రీలు గ్రామంలో ఉండకూడదు అన్న మరో సాంఘిక దురాచారం అక్కడ,
ఓ రకమైన నీటి జాడలేని భయంకరమైన అనధికార ఏజన్సీ,
మూడు మండలాలలో తాగునీరు కరువే,
కొద్దిపాటి జలవనరులు ఉన్న రెండు మండలాలలో ఒక మండలం వన్య మృగాలు,
KUPPAM-ELIPHENTSమరో మండలంలో ఏనుగులు పండించిన పంటలను నాశనం చేసేవి,
అత్యంత హ్రుదయవిదారక బాధలు ఉన్న ప్రదేశం,
గ్రానైట్ గ్రావెల్ క్వారీ కార్మికులుగా జనం జీవనం,
అమాయకపు జనం, కష్టం మాత్రమే తెలిసిన కల్మషం లేని జనం ,అందరూ కలసి కట్టుగా ఉండే సమైక్య జీవన విదానం,
బెంగళూరుకి వంద కిలోమీటర్ల దూరంలో గాలిలో తేమ శాతం ఉండే ఆహ్లదకరమైన వాతవరణం ఒక్కటే కుప్పం సొంతం,
1989 లో చంద్రబాబు ఏరికోరి ఎంచుకున్న నియోజకవర్గం “కుప్పం”

1989,1994,1999,2004,2009,2014,2019 లలో వరుసగా ఓటమి లేకుండా, శాసనసభ్యునిగా ముప్పై మూడు వసంతాలుగా ఘ నమైన సేవలందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం జాతీయ అద్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు శాసనసభ్యుడిగా ఎన్నిక కాక పూర్వం ఉన్న కరువు సీమని నందనవనంగా మార్చుతానని అయన ఇచ్చిన హామీకి కట్టుబడి , చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నియోజకవర్గంలో ప్రత్యేక అదికారులని వేసి, కుప్పం అభివృద్ధికి కి నడుం బిగించారు. ముందుగా అక్కడ ఉన్న సాంఘీక దురాచా రా లు, సామాజిక రుగ్మతలను పా రుద్రోలి జనాన్ని చైతన్యపరిచి వైద్యశాలలు విద్యాలయాలను నెలకొల్పారు.

మంచినీటి వనరుల కోసం దఫదఫాలుగా నాలుగు వందల కోట్లు రాష్ట్ర- కేంద్ర నిధులు కేటాయింపచేసుకున్నారు. చిన్నపాటి ప్యాసింజర్ రైళ్లు మాత్రమే అగే రైల్వే స్టేషన్, చంద్రబాబు చొరవతో వాజ్పేయ్ హయంలో స్టేషన్ ఆధునీకరణ, దేశం నలుమూలలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడింది. జిల్లా రహదారులని ఆధునీకరణతో , రాష్ట్ర జాతీయ రహదారులుగా రుపాంతరం చెందాయి ద్రావిడ విశ్వవిద్యాలయంతో పాటుగా.. ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీతో సహ దేశంలో ఎక్కడా లేని విదంగా, వందల సంఖ్యలో పాఠశాలలు విద్యాలయాలు కుప్పం సొంతం. ఆధునిక ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు చంద్రబాబు సమకూర్చిన అదనపు హంగులు.

వ్యవసాయ రంగ అబివృద్ది కొరకు నీటి జాడలేని పరిమిత వనరులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో .. 1996లలో ఇజ్రాయిల్ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సూక్ష్మ (మైక్రో ఇరిగేషన్) బిందు సేద్యం(డ్రిప్ఇరిగేషన్), తుంపర సేద్యం(స్పింక్లర్ ఇరిగేషన్) పాలీహౌస్,గ్రీన్ హౌస్ లను బారతదేశానికి మొట్టమొదటి సారిగా తీసుకువచ్చి, చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ప్రారంబించి బారతదేశ వ్యవసాయ రంగానికి కుప్పం నియోజకవర్గం మోడల్ గా నిలిపారు.

ఇండియన్ ఫ్లోరికల్చర్ హబ్- కుప్పం
నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందించిన ఇజ్రాయెల్ శాస్త్ర సాంకేతిక రంగ తోడ్పాటుతో, కష్టజీవులైన కుప్పం రైతులు అక్కడ చల్లటి వాతావరణానికి సరిపోయే బంతి, చామంతి, గులాబీ లతో పాటు విదేశాలకు చెందిన సరికొత్త జరబరా పుష్పాలు, పండ్లు కూరగాయల పంటలతో పాటు వాటికి అనుబందంగా పూలు పండ్ల మొక్కల నర్సరీల నిర్వహణతో కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి పూలు ,పూలbabu-kuppam1 మొక్కలు,కూరగాయల మొక్కల ఎగుమతి కేంద్రంగా జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు,
దక్షిణ బారతదేశంలో నేడు కుప్పం ప్రాంత పువ్వులు లేనిదే ఏ పండుగ లేదు, ఏ శుభకార్యం లేదు, ఏ పెళ్లి లేదు,చనిపోయిన ఎ వరి శవానికైనా ఏసే పూలదండలో ఉండేది కుప్పం పువ్వులే,అంతలా ప్రాచుర్యం పొందాయి కుప్పం పువ్వులు.

నర్సరీ హబ్ – కుప్పం
చంద్రబాబు మైక్రో ఇరిగేషన్ అబివృద్దితో పాటుగా పాలీ హౌస్, గ్రీన్ హౌస్ లు పెట్టుకోవడానికి అందించిన తోడ్పాటుతో, సరికొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వారికి పక్కన ఉన్న అడవులలో ఉండే నీటి ఎద్దడిని,kuppam-1 అధిక వర్షాలను, అధిక వేడిని తట్టుకునే మొండి జాతి మొక్కలతో , వంగ టమాటో మొక్కలని అంట్లు ద్వారా సంకరపరిచి తెగుళ్లు సోకని, అదునాతన అరోగ్యకరమైన వంగ టమాటా బంతి చామంతి గులాబీ నారుని దేశం మొత్తానికి సరఫరా చేస్తున్నారంటే.. శాసనసభ్యునిగా- ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము తోడ్పాటు అందుకు కారణం.
(ఇజ్రాయిల్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించే క్రమంలో దండగమారి వ్యవసాయాన్ని పండుగలా మారుస్తా అని అంటే నాటి ప్రతిపక్ష నేత రాజశేఖరరెడ్డి “”చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ”” అన్నాడని తినేటప్పుడు ఏరిగేటప్పుడు కూడా వారి మంది మాగదులు అదేమాట చెప్పి ,చెప్పించి చంద్రబాబుపై దుష్పచారం చేశారు)

ప్రతిపక్ష నేత దుర్మార్గపు రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో వెకిలి నవ్వులు నవ్వుతూ, హైదరాబాద్ లో చంద్రబాబు స్థాపించిన హైటెక్ సిటిలో, కంప్యూటర్లు డబ్బులు కాయలు కాస్తాయా, అవి ఎవరికి అన్నం పెడతాయి అని… మైక్రో ఇరిగేషన్ ని అవహేళన చేస్తూ వర్షం కురిపిస్తావా, చుక్కల నీటితో పంటలు పండిస్తావా అని వ్యంగ్యమైన మాటలతో, మైక్రో ఇరిగేషన్ ని అవహేళన చేస్తూ నిత్యం రాద్దాంతం చేస్తూ రైతుల మనసుల్లో విష బీజాలు నాటాడు. అయన ఎగతాళి మాటలకు తగిన సమాధానం, హైదరాబాద్ లో హైటెక్ సిటిలో కంప్యూటర్లకి అమెరికా డబ్బులు డాలర్ల కాయలు కాసాయి. విభజిత రాష్ట్రం తెలంగాణ కూడు గూడు గుడ్డ పథకాల డబ్బులు చంద్రబాబు విజన్ 2020 ఫలాలే .

చంద్రబాబు సారద్యంలో మంచినీరు దొరకని నాటి కరువు సీమ కుప్పం , పచ్చని పంటలతో అందమైన పూతోటలతో ,నాణ్యమైన కూరగాయలతో దేశమంతా సుప్రసిద్దమైనది ,నాటి శాస్త్ర సాంకేతిక మైక్రో ఇరిగేషన్ బారతదేశ రైతుల పాలిట అదర్శవంతంగా నిలచి వరప్రదాయినిగా మారింది.
ప్రగతి కాముకులు, పనిమంతులు నాయకులైతే ఏదైనా సాధ్యమే. చంద్రబాబు కుప్పం ఎందుకు వెళ్లాడు? అయనకేమి పని అనే సజ్జల లాంటి వ్యక్తులు, కనీసం అన్నం తినేటప్పుడైనా కుప్పం – చంద్రబాబు అద్వితీయమైన విడదీయరాని బందాన్ని అత్మవలోకనం చేసుకుంటే మంచిది

– వెంపరాల అమరేశ్వరరావు
తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి,
మైలవరం అసెంబ్లీ,
గొల్లపూడి విజయవాడ రూరల్,
ఎన్టీఆర్ జిల్లా

LEAVE A RESPONSE