Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు: చంద్రబాబు

పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా?

తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు.

తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం  జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి.
Whats-App-Image-2022-07-19-at-12-18-15-PM

LEAVE A RESPONSE