బాలకోటిరెడ్డిపై వైసీపీ గూండాల దాడి హేయం

165

-రొంపిచెర్ల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై వైసీపీ గూండాల దాడి హేయం
-టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ గూండాల కోసం ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను స్పెషల్ డ్రైవ్
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో వైసీపీ గూండాలు అధికారమదంతో అద్దు, అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీల దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం జగన్ రెడ్డి ప్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్షనేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీమూకల్ని హెచ్చిరిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ గుండాల కోసం ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి? ఫిజిక్స్ లో చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు మీరు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుంది. వెన్నా బాలకోటి రెడ్డిపై దాడికి పాల్పడ్డవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి.