వరద బాధితులకు చింతమనేని ఆధ్వర్యంలో కూరగాయలు, పాలు పంపిణీ

-వరద బాధితులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయ లు, 10 వేల లీటర్ల పాలు పంపిణీ

ఏలూరు జిల్లా,పోలవరంలోని వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యల్లో స్వయంగా రంగంలోకి దిగిన టిడిపి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. హనుమాన్ జంక్షన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయల కొనుగోలు. వేలేరుపాడు మండలంలోని

వరద ముంపు గ్రామాల్లో భాదితులకు సత్వరమే అందేలా చర్యలు. మంగళవారం ఉదయం వేలేరుపాడు మండలంలోని 1600 వరదబాధిత కుటుంబాలకు పాల ప్యాకేట్స్, పంపిణీ చేసేందుకు బయలుదేరిన చింతమనేని. రేపు మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకేట్స్ పంచేలా ఏర్పాట్లు. ఈసందర్భంగా చింతమనేని కామెంట్స్…

అధికారంలో ఉన్నా ,లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 4రోజులు గడుస్తున్నా భాదితులకు సరిగ్గా అన్నం పెట్టలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మా నేత చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు కాబట్టి ఈరోజు సహాయం అందిస్తున్నారు. అదే మా నాయకుడు రాకుంటే కనీసం బాధితులను పట్టించుకునేదా ఈ ప్రభుత్వం.

ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి ఉగ్రరూపంతో ఏలూరు జిల్లా కుక్కునూర్, వేలేరుపాడు మండలాల్లో 80 శాతం  కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు. పునరావాస కేంద్రాలు పెట్టినా అక్కడ సరైన ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం విఫలం అయింది. స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఇప్పటి వరకు భాదితులకు బియ్యం ఉప్పు పప్పు వంటివి అందలేదు.భోజనాలు కోసం అని పెట్టిన కేంద్రాల్లో ఉడికి ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారు. నిన్న వేలేరుపాడు మండలంలో 1600 కుటుంబాలను కలిసాము.ఈరోజు వారి ప్రతి కుటుంబానికి ఒక అరలీటర్ చొప్పున పాల ప్యాకేట్స్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈరోజు వారందరికి కేజీ ఉల్లి, కేజీ బంగాళా దుంప, పచ్చి మిర్చి, వంకాయ , టమాటా, దోస, ములక్కాయలు వంటి కూరగాయలు దాదాపు 15 టన్నులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ఈరోజు,రేపటి లోగా భాదితులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రేపు కుక్కునూర్ లో కూడా 10వేల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అర లీటర్ పాలు పంపిణీ కి ఏర్పాట్లు. చేశారు.వరద ముంపు గురైన భాదితులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.2 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ గత 3ఏళ్లలో వచ్చిన వరదల్లో ఏనాడు బాధిత కుటుంబాలకు ఈ ప్రభుత్వం రూ 2 వేలు ఇచ్చి ఆదుకోలేదు. రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు  వస్తున్నారని హడావిడిగా ఈరోజు సాయం అందిస్తున్నారు. అదే చంద్రబాబు రాకపోతే సాయం ఇచ్చేవారే కాదు.హెలికాఫ్టర్ లో సర్వే చేయటం తప్ప, వరద బాధితులకు ఈ సీఎం చేసింది ఏది లేదు. వరద ప్రాంతాలైన కోనసీమ, పోలవరం, ఆచంటలో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి,మంత్రులు అధికారులు ఎవరు కూడా సరిగా స్పందించట్లేదు. ప్రజలు , వృద్దులు, చంటి బిడ్డలు ఆకలితో అలమటిస్తుంటే 4రోజులు అయినా సరిగా అన్నం ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే మీరు పని చేస్తున్నట్లా,అసలు ప్రభుత్వం ఉన్నట్లా అని ప్రశ్నించిన చింతమనేని.

Leave a Reply