సైకో జగన్‌ ఇంటికి పోవటం ఖాయం

-మద్యనిషేధమని చెప్పి నాసిరకం మద్యంతో దోపిడ
-పేదల ఉసురుతీసి వారి జీవితాలతో చెలగాటం
-ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతారో నిలదీయండి
-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు
-నాదెండ్ల మండలం చందవరంలో ప్రచారం

జగన్‌ పాలనలో పేదలు బలయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం, సైకో జగన్‌రెడ్డి ఇంటికి పోవడం ఖాయ మన్నారు. నాదెండ్ల మండలం చందవరంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించా రు. తెలుగుదేశం మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభల్లో మాట్లాడారు. పేదల ఉసురు తీసిన జగన్‌రెడ్డిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి నమ్మే అవకాశం లేదన్నా రు. నమ్మినోళ్లను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల పేరు చెప్పి ఈ ఐదేళ్లలో లక్ష కోట్లు దోచుకున్నారని విమర్శించారు. తన ఆదాయం కోసం నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన దుర్మార్గుడు అని దుయ్యబట్టారు. రూ.60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ ఇప్పుడు రూ.200 చేశారన్నారు. ఎన్నికల ముందు మద్యనిషేధం అని తర్వాత రాష్ట్రాన్ని నాసిరకం మద్యంతో ముంచేసిన వ్యక్తి ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారో ఆడ బిడ్డలు నిలదీయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా పెంచేసిన ధరల దెబ్బకు పేదవాడు కడుపునిండా తినే పరిస్థితి కూడా లేకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు.

గడిచిన ఐదేళ్లలో మంత్రి విడదల రజిని ఒక్కసారైనా ప్రజల వద్దకు వచ్చి వారి కష్టనష్టాలు కనుక్కున్నారా అని నిలదీశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం, సూపర్‌ సిక్స్‌ పథకాలు అందాలన్నా కూటమితోనే సాధ్య మన్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బీజేపీతో తెలుగుదేశం పొత్తుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిప డ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply