దళిత ద్రోహి జగన్ రెడ్డి

• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి
• గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, వేధింపుల వెనుక మంత్రి విడదల రజనీ హస్తం
• యువతిని ప్రేమించడమే దళిత యువకుడు చేసిన నేరమా?
• యువకుడిని మంత్రి భర్త బెదిరించడం దేనికి సంకేతం?
• మంత్రి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
• టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు, దళిత మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులపై 11 వేలకు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్నారు. వందలాదిమందిని దారుణంగా అవమానించి చిత్రహింసలకు గురిచేశారు. దళితులపై జరిగిన ప్రతి దాడి ఘటన వెనుకా వైసీపీ నేతల హస్తం ఉంటోంది. గుంటూరు 2లో నరసింహరావు అనే ఎస్సీ యువకుడు ఓ యువతిని ప్రేమించాడనే కక్షతో ఆమె సోదరుడు తరుణ్ ఆ యువకుడిని కిడ్నాప్ చేసి నల్లపాడు సమీపంలో చిత్రహింసలు పెట్టి చితకబాదారు. ఎస్సీ యువకుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించడమే తప్పనట్టు అతన్ని మంత్రి విడదల రజనీ భర్త బెదిరించడం ..బలహీన వర్గాల హక్కులను కాలరాయడం కాదా? కిడ్నాప్ ఉదంతంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఫోన్ ద్వారా లైన్ లోకి వచ్చిన విడదల రజనీ భర్త యువకుణ్ణి బెదిరించాడు.

కేసు విత్ డ్రా చేసుకోవాలని, యువతి సోదరుడు ఇస్తానన్న రూ. 2 లక్షలు తీసుకుని పక్కకు పోవాలని లేకపోతే మీ కుటుంబసభ్యులకు చావు తప్పదని బెదిరించడం దేనికి సంకేతం? ఎస్సీ యువకుణ్ణి వేధించిన ఘటన మంత్రి విడదల రజనీ కనుసన్నల్లోనే జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో తెరవెనుక నుంచి మంత్రే ఆమె భర్తతో ఫోన్ చేయించి బెదిరించారు. యువతి కుటుంబసభ్యులు అగ్రకులం కావడం , రజనీ ఎన్నికల ఖర్చుకు సహకరిస్తారనే కారణంతోనే ఎస్సీ యువకుడిని బెదిరించారు. పిల్లి కోటి అనే టీడీపీ కార్యకర్త వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని పోలీసులు అతన్ని స్టేషన్ కు తీసుకెళ్లి మోకాళ్లపై నిలబెట్టి మంత్రి రజనీకి ఫోన్ లో చూపించారు. ఎస్సీ యువకుడిని హత్య కుట్ర చేసిన రజనీ భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. నరసింహారావును చిత్రహింసలు పెట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయంలో ఉన్నాడు.

అధికార పార్టీ భజనలో పోలీసులు:
కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కొందరు పోలీసులు అధికార పార్టీ భజన చేయడం ఎంతవరకు సమంజం? బాధితుడు స్వయంగా ఫిర్యాదు చేసినా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓడిపోతామనే నైరాశ్యంలో వైసీపీ రౌడీలు టీడీపీ క్యార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. వైసీపీ మూక కళ్ల ముందే చెలరేగిపోతున్నా చోద్యం చూస్తున్నారు.

దళితులపై జగన్ రెడ్డి కపట ప్రేమ:
దళిత దీనజనోద్ధారకుడిలా నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి 4 గురు దళితులు హత్యలకు, 6 గురు హత్యాయత్నాలకు, రోజుకు ఇద్దరు దళితులు దాడులకు, వారానికి 3 ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. కంచికచర్లలో శ్యాంకుమార్ పై దాడి చేసి నోట్లో మూత్రం పోశారు.హోం మంత్రి సొంత నియోజకవర్గం కొవ్వూరులో మహేంద్ర అనే యువకుడి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.కర్నూలు, నంద్యాలలో దళిత న్యాయవాది మందా విజయ్ కుమార్‌పై దాడి చేశారు. ఇలాంటి ఘటనలో ఎన్నో జరిగినా ఒక్కరిపైనా చర్యల్లేవ్. ఇప్పటికైనా పోలీసులు తమ విధి నిర్వహణలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. గుంటూరులో ఎస్సీ యువకుడి కిడ్నాప్, మంత్రి రజనీ భర్త బెదిరింపుల విషయంలో బాధితుడి పక్షాన నిలబడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply