Suryaa.co.in

Andhra Pradesh

పిచ్చోడు లండన్ కి… మంచోడు జైలుకి: లోకేశ్ ఆగ్రహం

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. కాగా, తన తండ్రి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.

యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధనం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు… కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా… అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “పిచ్చోడు లండన్ కి… మంచోడు జైలుకి… ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “ఎఫ్ఐఆర్ లో పేరు లేదు… ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు… మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్” అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE