– తెలుగుజాతి వెలుగు నందమూరి తారకరామారావు
– మహానాడులో వినిపించే టీడీపీ నినాదాలతో జగన్ గుండె ఆగాలి
– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు
“ ఈ రోజు మననాయకుడు ఎన్టీఆర్ 99వ జయంతి. తెలుగుజాతి వెలుగు నందమూరి తారకరామారావుగారు, తెలుగుప్రజల పౌరుషం నందమూరి తారకరామారావుగారు, ఎంతోమంది పుడతారు..గిడతారు. కానీ ఎన్టీఆర్ ఎన్టీఆరే…ఎన్టీఆర్ ఒక్కడే…ఆయన ఒక యుగపురుషుడు. ఆయనకు ఆయనే తప్ప మరెవ్వరూ సాటిరారు.. కాబోరు. సామాన్య కుటుంబంలో పుట్టినవ్యక్తి, అచంచలమైన ఆత్మవిస్వాసంతో ముందుకుసాగి, ఎవరికీ దక్కనటువంటి ఖ్యాతినార్జించారు. 40 సంవత్సరాల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించి… విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా నిలిచారు. వేంకటేశ్వరస్వామిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, ఇతరదేవతామూర్తులపాత్రల్లో ఎన్టీఆర్ రూపం మనందరి దైవంగానిలిచింది. నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. 40ఏళ్లపాటు ప్రజలు తనను చిత్రరంగంలో పెద్దవాడిని చేసి ఆదరించిన వారి రుణం తీర్చుకోవడానికి, వారికి అండగా నిలవడానికి రాజకీయపార్టీ స్థాపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, అదిచూసి ఓర్వలేకనే ఆయన రాజకీయాల్లోకివచ్చారుతప్ప, అధికారంకోసం కాదు. పేదలకు ఏంకావాలో ఆలోచించి, అవన్నీ అమలుచేశారు. ఆనాడు ఆయనపెట్టిన రెండురూపాయలకే కిలోబియ్యం పథకం, నేడు దేశానికే ఆహారభద్రతకల్పించే వ్యవస్థగా మారింది. ఆయన పెద్దసంస్కరణ వాది, పరిపాలనాదక్షుడు, ముందుచూపు ఉన్న నాయకుడు, ఆయనేం చేసినా భావితరాల కోసమే చేశారు.
తెలుగుజాతిఉన్నంతకాలం ప్రతితెలుగువాడి గుండెల్లో కొలువైఉండేవ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన్ని తలుసుకొని, ఆయనస్ఫూర్తితో ఏపనిమొదలెట్టినా ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయంసాధించి తీరుతారు. అలాంటి గొప్పవ్యక్తి, మనందరివాడు, మహాను భావుడు ఎన్టీఆర్. తమ్ముళ్లూ.. తప్పుడు రాజకీయాలను ప్రజలుఆమోదించరు. మహానాడుకి ఎవరూ వెళ్లకూడదంటూ భయపెడుతున్నారు.
డ్వాక్రామహిళలు, ఉపాధికూలీ లను, ఇతరవర్గాలవారిని మహానాడుకి వెళ్తే, అవి ఇవ్వం…ఇవిఇవ్వం అని, ఇక్కడే ఉండాలని భయపెడుతున్నారు. ఎవరో ఏదోచెబితే భయపడటానికి మనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బానిసలం కాదు. మనమందరం స్వతంత్రపౌరులమే. రోషం, పౌరుషం ఉన్న అందరూ కట్టలు తెంచుకొని మహానాడుకి రావాలి. అదిచూసి వైఎస్సార్ కాంగ్రెస్ వారికి, జగన్ కు గుండెలు అదిరిపోవాలి. మీరుచేసే సింహానాదాలతో మహానాడు ప్రాంగణమే కాదు, యావత్ రాష్ట్రమే దద్దరిల్లాలని గుర్తుంచుకోండి.
తమ్ముళ్లూ… ఈ జిల్లాసమస్యలు చాలాఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ గానీ, ఒంగోలు కేంద్రంగా జరిగిన అభివృద్ధిగానీ, అవన్నీ దామరచర్ల జనార్థన్ హయాంలోజరిగినవే. సిమెంట్ రోడ్లు, మార్కెట్ యార్డ్, రోడ్లవెడల్పు, సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం లాంటి అనేక పనులుజరిగాయి. మరిన్ని విషయాలు
వివరంగా సాయంత్రం బహిరంగసభలో మాట్లాడుకుందాము. మనం మహానాడు పెట్టామని, దానికి సమాంతరంగా వారు బస్సుయాత్ర పెట్టారు. మనవద్ద జనంఉంటే, వారివద్ద కేవలంఉత్తుత్తి బస్సులే ఉన్నాయి. జనమంతా ఇక్కడుంటే, బస్సులు అక్కడ ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే 5కోట్ల మంది సహా, తెలంగాణవారు గానీ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అమర్ రహే.. ఎన్టీఆర్ అమర్ రహే.”
కార్యక్రమానికి అధ్యక్షులుగా టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటుచేసిన భారీ కేక్ ను చంద్రబాబు కట్ చేశారు.