ఆస్తి పన్నును 5% పెంచేందుకు సన్నాహాలు

Spread the love

– గ్రామీణులపై ఏపీ సర్కార్‌ మరో పిడుగు

అమరావతి: గ్రామీణులపై మరో పన్ను పిడుగు పడనుంది. పల్లెల్లో ఆస్తి పన్నును 5% పెంచేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నిరుడూ ఇలాగే 5% పెంచారు. ఈ ఏడాది పెంపుపై ఉత్తర్వులేమీ ఇవ్వలేదు. కానీ… పెంచేసి, అమలు చేయాలని మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. గత సంవత్సరం జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు… ఆస్తిపన్ను పెంపుపై ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply