Suryaa.co.in

Andhra Pradesh

రేపు ఏలూరు జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి!? ప్రారంభిచనున్న చంద్రబాబు

-రేపటి నుంచి 3 రోజుల పాటు ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
-రాష్ట్ర వ్యాప్తంగా డిశంబర్ 2 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించనున్న టిడిపి

అమరావతి:- రాష్ట్రంలో రివర్స్ పాలన, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, సమస్యలు, విధ్వంసాలపై తెలుగు దేశం పార్టీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి!? పేరిట కార్యక్రమం తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలసుకోవడం, ప్రజలతో చర్చించడం, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో కార్యక్రమం సాగనుంది.

గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు వరకు అంతా దీనిలో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు మూడు జిల్లాలలో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు దెందులూరు, చింతలపూడి, రెండో పోలవరం, కొవ్వూరు, మూడో రోజు నిడదవోలు,తాడేపల్లి గూడెం నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.

రేపు దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిశంబర్ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జ్ లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో మొదలు పెడతారు.

LEAVE A RESPONSE