పులివెందులలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులకు చంద్రబాబు పరామర్శ

Spread the love

అమరావతి:-కేసుల భయంతో పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో దంపతులు రామంజనేయులు, కృష్ణవేణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు అయిన వీరు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. దీనిని మనస్సులో పెట్టుకున్న వైసీపీ స్థానిక నేతలు అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్ కు రావాలంటూ వేధించారు. దీంతో ఆందోళనకు గురైన రామంజనేయులు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఫోన్ లో టిడిపి అధినేత పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండంగా ఉంటుందని తెలిపారు. పోలీసులు వేధింపులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply