Suryaa.co.in

Andhra Pradesh

ఒకటి నుంచి ప్రాజెక్టుల సాక్షిగా జగన్ వైఫల్యాలను, జనం ముందు ఎండగట్టనున్న చంద్రబాబు

• ఆగస్ట్ 1 నుంచి 10వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనకు టీడీపీ అధినేత
• సాగునీటి, వ్యవసాయరంగాల్ని భ్రష్టుపట్టించి జగన్ చేతగానితనం, అసమర్థతను ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచనున్న చంద్రబాబు
• సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిని చంద్రబాబు కళ్లకుకట్టినట్టు ఆధారాలతో సహా మీడియాసాక్షిగా ప్రజలకు చెప్పారు
• మేం చెప్పినవాటిపై స్పందించకుండా బుద్ధిలేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే రాంబాబుకి ప్రజలే బుద్ధిచెబుతారు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

దోపిడీ, ఎదురుదాడి, హత్యరాజకీయాలు తప్ప జగన్ కు అభివృద్ధి, సంక్షేమం పట్టడం లేదని, అతని నాలుగేళ్ల పాలనతో ప్రజలకు అర్థమైందని, రాష్ట్రాభివృద్ధికి కీలకమైన సాగునీటి, వ్యవసాయరంగాల్ని చేతగానితనం, అసమర్థత తో జగన్ భ్రష్టు పట్టించాడని, ఆయా రంగాల్లో జగన్ వైఫల్యాలను ఎత్తిచూపడానికే ఆగస్ట్ 1 నుంచి 10 వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే …

“ అవినీతి, అధికారమత్తులో ఏపీ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన జగన్ రెడ్డి ప్రధానరంగాలైన సాగునీటి, వ్యవసాయరంగాల్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. దేశానికి అన్నంపెట్టే రైతులు కాడి వదిలేసి, పంటల విరామమే నయమని, ఎందుకు వ్యవసాయం చేయాలనే స్థితికి వచ్చేలా చేశాడు. వ్యవసాయం బాగుకి సాగునీటి రంగమే కీలకమనే ఇంగితం జగన్ కు లేకపోవడం బాధాకరం. టీడీపీప్రభుత్వం ప్రారంభించి, 60 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తైన అనేక ప్రాజెక్టుల్ని అటకెక్కించాడు. 69 నదులు రాష్ట్రంలో ఉండటం నిజం గా ప్రజలకు, రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి లాంటి ప్రధాన నదులుండి రాష్ట్రంలో ఎందుకు సాగు పెరగడం లేదనే ఆలోచన జగన్ చేయకపోవడం నిజంగా రైతుల దౌర్భాగ్యమనే చెప్పాలి. టీడీపీ, ఇతరపార్టీలు, ప్రజలు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం చెప్పలేని దుస్థితి జగన్ ది.

చంద్రబాబు ఐదేళ్లలో రూ.62వేలకోట్లు ఖర్చుపెడితే, జగన్ 22వేలకోట్లతో సరిపెట్టాడు…
ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ ఎన్.టీ.ఆర్ సాగునీటి ప్రాజెక్టులకు బీజంవేస్తే, చంద్రబాబు కొత్తవి నిర్మించి సాగు విస్తీర్ణం పెంచారు. సాగునీటి రంగంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని గొప్పపనుల్ని ఎన్.టీ.ఆర్, చంద్రబాబు చేసి చూపించారు. 2014-19లో టీడీపీప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి రూ.62 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో రూ.22 వేలకోట్లు కూడా పెట్టలేదు. జగన్ కు అత్యంత ఆప్తుడైన ఇరిగేషన్ అధికారే (ఈ.ఎన్.సీ) చంద్రబాబు ఐదేళ్లలో రూ.1680 కోట్లు ఖర్చుపెట్టి, ఉత్తరాంధ్రలోని సాగు నీటి ప్రాజెక్టుల్ని, ఎంతశాతం పూర్తిచేశాడో చెప్పాడు.

జగన్ ఈ నాలుగేళ్లలో కేవలం రూ.320కోట్లే ఖర్చుపెట్టాడని, అదీ పనులు చేయడానికి కాకుండా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని చెప్పాడు. మా ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో ఈ ప్రభుత్వం వద్దే వివరాలు ఉన్నాయి. పోలవరంసహా, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతుల్ని చంద్రబాబు మీడియాసాక్షిగా ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళ్లకు కట్టినట్టు వాస్తవాల్ని రైతులకు తెలియచేశారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందించి, వారికి అండగా నిలిచి, ఎలా ఆదుకున్నామో, ఈ ప్రభుత్వంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప, మరో గత్యంతరం లేని పరిస్థితి ఎందుకొచ్చిందో వివరించారు. 2014 నుంచి 2019 మధ్యకాలం రైతులకు, వ్యవసాయానికి స్వర్ణయుగమైతే, 2019 నుంచి రాక్షస యుగమనే చెప్పాలి.

1 నుంచి 10 వరకు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన… ప్రాజెక్టుల వద్దే బస
రాష్ట్రంలోని ప్రాజెక్టుల దుస్థితిని తెలియచేసి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఆగస్ట్ 1 నుంచి 10 వరకు చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు వెళ్లనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కళకళలాడిన సాగునీటిప్రాజెక్టులు, రైతన్నల ముఖాలు నేడు వెలవెలబోతు న్న తీరుని ఆయన ప్రజలకు వివరిస్తారు. పెన్నా నది నుంచి వంశధార వరకు రాష్ట్రంలోని అన్ని నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని పరిశీలించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలముందు ఉంచనున్నారు. అన్ని జిల్లాలకు వెళ్లి టీడీపీహయాంలో ఏ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు పెట్టి, ఎంతపూర్తిచేశాం.. ఎన్ని ఎకరాలకు నీరిచ్చామనే వాస్తవాలు తెలియచేస్తారు. అధికారికంగా జీవోలు ఇచ్చిమరీ జగన్ ఏ ప్రాజెక్టుని ఎలా నాశనంచేశాడో , రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఎలా నిర్వీర్యంచేశాడో వివరిస్తారు.

ముచ్చుమర్రితో మొదలెట్టి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో ముగిస్తారు..
1వ తేదీన ఉమ్మడి కర్నూలుజిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చు మర్రి ప్రాజెక్ట్ వద్దకు వెళతారు. అక్కడి నుంచి కడపజిల్లా గండికోట ప్రాజెక్ట్.. తరు వాత అనంతపురం జిల్లాలోని ప్రాజెక్టుల్ని సందర్శిస్తారు. అనంతరం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్లి హెచ్.ఎన్.ఎస్ పరిశీలించి, తరువాత తిరుపతి లోని బాలాజీ రిజర్వాయర్ సందర్శిస్తారు. అనంతరం ప్రకాశం జిల్లాలోని గుండ్ల కమ్మ ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి, తరువాత ఉత్తరాం ధ్రలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళతారు. ప్రాజెక్టుల వద్దే రైతులతో కలిసి బసచే స్తారు. 1 నుంచి 10 వరకు ప్రాజెక్టుల వద్దే ఉండి, ఆయాప్రాజెక్టులు ఎవరి హాయాం లో ఎంతపూర్తయ్యాయో, ఎవరు ఏం చేశారో వివరిస్తా రు.

చంద్రబాబు 80శాతం పూర్తిచేస్తే, జగన్ 20శాతం చేయలేకపోయాడు..
చంద్రబాబు 80శాతం పూర్తిచేసిన ప్రాజెక్టుల్ని కూడా జగన్ నాలుగేళ్లలో 20 శాతం పూర్తిచేయలేదు. కనీసం వాటిపనులకు పైసా ఖర్చుచేయలేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి నిధులు లేవని జగన్ చెప్పడం ముమ్మాటికీ రైతాం గాన్ని వంచించడమే. రైతులతో పాటు, మేథావులు, విజ్ఞులు రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయంపై, సాగునీటి ప్రాజెక్టుల్ని నాశనంచేసిన తీరుపై స్పందించాలి. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా జరిగే చంద్రబాబు పర్యటనను రైతాంగం విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రికి అబద్ధాలు, అవినీతి తప్ప మరేవీ పట్టవని తేలిపోయిం ది. చంద్రబాబు వస్తేనే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తై, రైతాంగానికి, వ్యవసాయానికి మంచిరోజులు వస్తాయనే వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలి.

బుద్ధిలేకుండా మాట్లాడుతున్న రాంబాబుకి రైతులే బుద్ధిచెబుతారు..
వైసీపీని, జగన్ ను బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు తెలుసుకున్నారు. రైతన్న వెంటిలేటర్ పై ఉంటే, ఇంకా సమయం కావాలంటే ఎలా? నాలుగున్నరేళ్లు అప్పుడు…ఇప్పుడు అని తేదీలు మార్చారు తప్ప, ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేసి, ఎక్కడా కొత్తగా ఒక్క ఎకరాకు నీరిచ్చింది లేదు. 8నెలల్లో ఎన్నికలు వస్తుంటే, ఇంకా సమయంకావాలంటూ, బుద్ధిలేకుండా మాట్లాడుతు న్న అంబటి రాంబాబుకి రైతులే బుద్ధిచెబుతారు. సొంత నియోజక వర్గంలోని పంటకాలువల్లో పూడిక, తూటికాడ తొలగించలేని రాంబాబు ప్రాజెక్టుల గురించి చెబుతుంటే జనం నవ్వుతున్నారు.” అని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE