చంద్రబాబు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ కిషన్ రెడ్డి!

Spread the love

– వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి హరీశ్ రావు ఆవేదన
– సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు కారణమైంది. మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఆయా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

మూడు పంటలు పండాలనే కేసీఆర్ ను కడుపులో పెట్టి చూసుకుందామని ఎవరూ తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో.. ప్రజలు మీరే ఆలోచన చేయాలి.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని, సద్దితిన్న రేవు తలవాలని సీఎం కేసీఆర్ ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.

ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ.. వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ బెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Leave a Reply