-ఈనాడు రోజులు కావు ఇంటర్నెట్ యుగం ఇది
-ఎంపి విజయసాయిరెడ్డి
కార్యకర్తలు చట్టాన్ని ధిక్కరించి జైలుకు వెళ్తే అధికారంలోకి వచ్చాక స్వాతంత్ర సమరయోధుల తరహాలో పెన్షన్లు, సౌకర్యాలు కల్పిస్తావా? అన్యాయం కదా బాబన్నా? అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ విజయసాయిరెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. అమాయకులను జైళ్లకు పంపి మీ తండ్రీకొడుకులు తమాషా చూస్తారా! ఆ త్యాగాలేవో మీరే చెయ్యొచ్చు కదా, కుల మీడియా ఫుల్ కవరేజి ఇస్తుందని ఎద్దేవా చేశారు. సోమవారం పలు అంశాలపై ట్వీటర్ లో స్పందించారు.
1995కు ముందు దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో కంప్యూటర్ మీద బాబు ఏం పని చేసాడబ్బా? వీడియో క్యాసెట్లు వేసుకుని చూసేవాడా? అప్పటిదాకా కంప్యూటర్లు పరిశోధనా సంస్థలో తప్ప మిగతా చోట్ల అలంకారప్రాయాలుగానే వుండేవన్నారు. టిడిపి మీడియా ప్రచార విభాగం బాబు పరువు తీస్తోందని చెప్పారు.
రాజకీయ పోరాటం ఎప్పుడూ ప్రజల జీవితాలను మార్చే ఎన్నికల రణక్షేత్రమై గెలుపు ద్వారా సాధించుకోవాలని తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు. సాముగరిడీల చంద్రబాబు కుల మీడియా విషపు రాతలతో విజయం సిద్ధిస్తుందనే భ్రమల్లో ఉన్నారని మండిపడ్డారు. ఈనాడు రోజులు కావు ఇంటర్నెట్ యుగం ఇది అని తెలుగుదేశం పార్టీకి హితబోద చేశారు.
ఫోన్ కాల్ తో వైద్య సేవాలు
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను సమకూరుస్తోందని చెప్పారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చునన్నారు.