జవసత్వాలు నింపనున్న భారత్  జోడో యాత్ర

సామజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు  రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమైపోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.  లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా పాల్గొంటున్న ఈ యాత్రలో  పాల్గొంటున్నారు. 80 ఏళ్ల క్రితం ఇదే రోజున మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.  ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్య్రానికి దారితీసిందని ఆయన అన్నారు. భారతదేశం అంతటా ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి పాన్-ఇండియన్ మార్చ్‌ను గుర్తించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక యాత్ర.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ఇది సైద్ధాంతిక యుద్ధం. కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే భారతదేశాన్ని రక్షించగలరు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడిస్తుంది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో సంభాషించారు. దాదాపు వందకు పైగా పౌర సమాజ సంస్థలు స్వచ్చంధ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావడం ఆలాగే  మీడియా ప్రతినిధులు, రిటైర్డు  ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు మరియు శాస్త్రవేత్తలు  ఈ యాత్రలో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సెప్టెంబర్‌ ఏడవ తేదీన శ్రీకారం చుట్టనున్న ‘భారత్‌ జోడో యాత్ర’ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్‌లో పూర్తికానుంది. ఇందులోభాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఏకంగా 3,570 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌.. జుడే వతన్‌)’  నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు కాంగ్రెస్‌ నడుంబిగించింది. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్రభారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూర్‌ మీదుగా యాత్రను కొనసాగిస్తారు. షెడ్యూల్‌లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్‌లోనూ యాత్ర ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్, తర్వాత జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని కోటా పట్టణం.. తర్వాత డౌసా, అల్వార్‌లో పాదయాత్ర ముందుకు వెళ్లనుంది. ఉత్తరభారతం విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌ షహర్, తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, అంబాలా(హరియాణా)లనూ పాదయాత్ర పలకరించనుంది. జమ్మూ పట్టణం, ఆ తర్వాత చివరిగా శ్రీనగర్‌లో పాదయాత్ర పూర్తికానుంది. భౌగోళికంగా నదీజలాలు, కొండలు, అటవీప్రాంతం.. పాదయాత్ర మార్గానికి ఆటంకం కలగకూడదని అవి లేని మార్గాల్లో పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు కాంగ్రెస్‌ నాయకులు తుదిరూపునిచ్చారు.100 మంది ‘భారత యాత్రికులు’ పాదయాత్రలో యాత్ర తొలి నుంచి తుదికంటా 100 మంది మాత్రం కచ్చితంగా పాలుపంచుకోనున్నారు. వీరిని ‘భారత యాత్రికులు’గా పిలవనున్నారు. ఏ రాష్ట్రం గుండా అయితే భారత్‌ జోడో యాత్ర మార్గం లేదో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో 100 మంది ‘అతిథి యాత్ర’లు చేస్తారు. పాదయాత్ర ఉన్న రాష్ట్రాల నుంచి మరో 100 మంది ‘ప్రదేశ్‌ యాత్రికులు’ జతకూడుతారు. అంటే ప్రతిసారి 300 మంది పాదయాత్రికులు కచ్చితంగా ఉంటారు. రోజూ దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం యాత్ర ముందుకెళ్తుంది.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply