Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు బెయిల్ ఇప్పట్లో రాదు

– రాజధాని పేరుతో అన్యాయంగా భూ దోపిడికి పాల్పడటమే ప్రధాన కారణం.
-రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎన్నో అన్యాయాలు, దుర్మార్గాలకు పాల్పడ్డాడు.
– గౌరవ న్యాయస్థానం, ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాన్ని తేలుస్తారు.
– ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి: చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇప్పట్లో రాదని, రాజధాని పేరుతో అన్యాయంగా భూ దోపిడికి పాల్పడటమే అందుకు ప్రధాన కారణమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.‌ రాజధాని లో చంద్రబాబు నాయుడు భూదోపిడిలకు సంబంధించి తాను దాదాపు 40-50 కేసులను వేయడం జరిగిందన్నారు.

న్యాయస్థానం పేదల పట్ల, ఎస్సీ, ఎస్టీ , దళిత, బిసీ రైతుల పట్ల తీర్పులు అనుకూలంగా ఇవ్వబట్టే చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు వేయలేకపోయారని గుర్తు చేశారు. అయినా చంద్రబాబు చివరి రోజుల్లో ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చేసిన వాటిపై 2019-20 లో తాను పలు కేసులు వేయగా గౌరవ స్థానం ముందుకు వచ్చాయని, వాటికి అనుగుణంగా చంద్రబాబు దోషిగా నిలబడే అవకాశం గౌరవ న్యాయస్థానం కల్పించిందన్నారు. చంద్రబాబు నైజం అందరికీ తెలుసుననన్నారు.

అధికారం కోసం ఎన్టీ రామారావు అంతటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబును అంగీకరించిన ఆ పార్టీ మనుషులు ఆయన చేసిన ఆర్థిక నేరాలను మాత్రం అంగీకరించలేకపోతున్నారని చెప్పారు.

వారు చంద్రబాబు చేసిన ఆర్థిక నేరాలను అంగీకరించే విధంగా కచ్చితంగా న్యాయస్థానాలు న్యాయానికి నిలబడతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చట్టం ముందు అందరం సమానమేనన్నారు. ఈ విషయం తెలిసి కూడా టిడిపి వాళ్లు గందరగోళం చేయడం భావ్యం కాదని, గౌరవ న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. బాబు నాయుడు 2014లో శ్రీకృష్ణ కమిటీని కూడా కాదని రాజధానిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను అక్రమంగా కొట్టివేయలని చూశారని ఆరోపించారు.

అయితే తాను ఆ రోజు నుంచే చంద్రబాబుపై రాజకీయ పోరాటం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. 1943-44 నాటి బ్రిటీష్ కాలంలో అసైన్ చేసిన దళిత భూములు ప్రభుత్వ భూములేనని ప్యాకేజీ ఇవ్వమని భయపెట్టి, బెదిరించి ఆ భూములను కారుచౌకగా కట్టబెట్టారని విమర్శించారు.

ఆ తరువాత జీఓ నెంబర్ 41 ను తీసుకువచ్చి ఆనాటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ రిజిస్ట్రేషన్ లు చేయించి అప్పటికే భూములు కొనుగోలు చేసిన తన మనుషులకు ప్యాకేజిలను అందించి లబ్ది చేకూర్చారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు చాలా అన్యాయాలు, దుర్మార్గాలు చేశాడని, వాటన్నింటినీ ప్రజలు, న్యాయస్థానాలు ఖచ్చితంగా తేలుస్తాయని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE