– కేంద్రం- రాష్ట్రం.. అనేక పార్టీలు ఒప్పుకుని సవరణలు చేస్తేనే జమిలి ఎన్నికలు
– రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తాము
– జగన్ కు మాట్లాడే అర్హత లేదు
– రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి: వై.యస్.ఆర్ పార్టీ తీరు మొగుడిని కొట్టి మొగసానికి ఎక్కిన చందాన ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బంధు జనం కోసం దోచుకోవడం కోసం అన్ని చార్జీలు పెంచేశారు. జగన్ ట్రూ ఆప్ విద్యుత్ చార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయంలోనివో జగన్ చెప్పాలి.
కేంద్రం రాష్ట్రం అనేక పార్టీలు ఒప్పుకుని అనేక సవరణలు చేస్తేనే జమిలి ఎన్నికలు అమలులోకి వస్తాయి. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేయాలి. ఏ సొసైటీ కి రూరల్ లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. గతంలో జరిగిన తప్పులకు విచారణ జరుగుతుంది. బియ్యం దొంగతనం చేశారు. సామాన్యులకు అందాల్సిన బియ్యం దోచేశారు. చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు అంటున్నారు. నేరం చేసిన వారు తప్పించుకోలేరు. ఇసుక లో అయినా మట్టిలో అయినా గ్రావెల్ అయినా, ఉత్త్పత్తి పెరిగితే ధరలు కచ్చితంగా అందుబాటులోకి వస్తాయి.
అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెను భారం మోపారు.కరెంట్ కోతలు విధించారు, కొత్త కనెక్షన్ లు ఇవ్వలేదు, ట్రాన్స్ఫార్మర్ సైతం అధిక ధరకు కొనుగోలు చేశారు.జగన్ 10 లక్షల అప్పు చేసి ఏమి అభివృద్ధి చేశారో జగన్ ప్రజలకు తెలపాలి. జగన్ నీటి పారుదల రంగాన్ని నీళ్ల పాలు చేశారు. జగన్ కు మాట్లాడే అర్హత లేదు.
జగన్ తప్పులు అన్ని లెక్కించబడుతున్నాయి. విద్యుత్ అధిక రేట్లు మోపడానికి కారణం జగన్. రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తాము. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తాము. అనేక రంగాలకు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది. అన్ని రంగాలకు జగన్ రాయితీలు నిలిపివేశారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛను అమలు చేసాం. కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఒక్క పథకం సరిగ్గా అమలు చేయని జగన్ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ప్రజల్ని, ఎమ్మెల్యేలను ఎప్పుడైనా కలిశారా పవన విద్యుత్ అమలు చేశారా? సర్ ప్లస్ విద్యుత్ నుండి లోటు లోకి జగన్ తీసుకుని వెళ్ళిపోయాడు.