– కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట: మాజీ ముఖ్యమంత్రి జగన్ నాడు చేసిన అవినీతి విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడమే కాక ప్రజలపై చార్జీల భారం పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.వాడపాలెం కార్యాలయం జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అవినీతి,అసమర్థతతో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీ పీ ఏ) ద్వారా 25 సంవత్సరాలకు యూనిట్ విద్యుత్తు ధర 4.86 రూపాయలకు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంటే దాన్ని నిర్వీర్యం చేసి జగన్ అవినీతి కోసం కొత్త దారులు తొక్కారని అన్నారు.