– కూటమి ప్రభుత్వం రాకతో అన్నక్యాంటీన్లకు జవసత్వాలు
– పేద వర్గాల్లో వెల్లివిరిస్తున్న సంతోషం
– ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ: అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పేదల ఆకలి తీర్చేం దుకు అన్న క్యాంటీన్లు మళ్లీ తెరచుకోవ డంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోందని ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం నందిగామ పట్టణంలోని అన్న క్యాంటీన్ సందర్శించారు. నల్లాని బల్లెమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారులు రామ్మోహన్, రవి కుమార్ లు అన్న క్యాంటీన్లో అన్నదానం చేయడం పట్ల సౌమ్య వారిని అభినందించారు. నాయకులు కార్యకర్తలు వారి పుట్టినరోజులు వివిధ శుభకార్యాలు జరుపుకొని సందర్భంలో ఈ విధంగా అన్న క్యాంటీన్ లో అన్న సమారాధనకు సహకరిస్తున్న దాతలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.