Suryaa.co.in

Andhra Pradesh

పేదల విద్యకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట

– విద్యతోనే ఉజ్వల భవిత
– ఎం జె పి బాలుర పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

తిరుపతి :చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఐతేపల్లిలోని ఎం జె పి బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనికీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఈ సందర్భంగా హాస్టల్ లోని అన్ని గదులను ,బాత్ రూమ్ లను మంత్రి పరిశీలించారు.విద్యార్థులను కలసి ఉపాధ్యాయులు భోదిస్తున్న తీరును ,హాస్టల్ లోని భోజన సదుపాయం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భోజనం సరిగ్గా పెడుతున్నారా, చదువు బాగా చెపుతున్నార అని విద్యార్థులు ను అడిగి తెలుసుకున్న మంత్రి సవిత అనంతరం విద్యార్థులు ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సవిత తెలిపారు.

విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని , కొంత మంది సెల్ ఫోన్లు చూసి చెడు దోవ పడుతున్నారని తెలియచేసారు.అందుకే ఇప్పటి నుండే ప్రతి ఒ‍క్కరూ తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అందుకనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE