కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచి అమలు చేస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న తీరును రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.