రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి సర్వేపల్లిలో తోడేరు రెడ్డి చాప్టర్ క్లోజ్

– తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు నగరంలో ఉన్న సోమిరెడ్డి కార్యాలయంలో సోమవారం సాయంత్రం వెంకటాచలం మండలం పుంజులూరుపాడు గ్రామానికి చెందిన 18 కుటుంబాలు వైయస్ఆర్సిపి పార్టీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.

సర్వేపల్లి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయని ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయం.సర్వేపల్లి టీడీపీలో జోరుగా కొనసాగుతున్న చేరికలతో కుదేలైన వైఎస్ఆర్సిపి. నానాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలమైన శక్తిగా తయారు కావడంతో తట్టుకోలేని కాకాణి ఫ్రస్టేషన్లో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడు.

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సర్వేపల్లిలో టీడీపీ – జనసేనల కూటమికి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ సోమిరెడ్డి ఆధ్వర్యంలో దూసుకెళ్తుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాకాణి. ఓటమి ఖాయం అవడంతో కాకాణి ఫ్రస్టేషన్లో నోటికి వచ్చినట్లు తిట్టడాన్ని అలవాటు చేసుకుంటున్నాడు.

చేరికల విషయంలో తాము కాకాణిలా బోగస్ ప్రకటనలు చేయడం లేదు.సర్వేపల్లి టీడీపీలోకి వలసలు నానాటికి మరింత ఉదృతమయ్యాయి. టీడీపీలో చేరే వారిని కాకాణి అనేక విధాలుగా బెదిరిస్తున్నాడు.. కాకాణి బెదిరింపులకు ఎవరు భయపడే పరిస్థితిలో లేరు.సర్వేపల్లిలో టీడీపీ దూకుడు పెంచడంతో వైసీపీ చతికిలపడిపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లిలో కాకాణికి డిపాజిట్లు కూడా రావు. ఓటమి భయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాకాణి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటకృష్ణయ్య నాయుడు, ఆర్ని మల్లికార్జున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మహేంద్ర నాయుడు, దాసి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply