Suryaa.co.in

Editorial

బాల నటి.. భలే భలే!

  • జగన్ ముద్దుపెట్టిన బాలనటికి ‘బంగారు నంది’ ఇవ్వాల్సిందే

  • కాంచన, కన్నాంబ, సావిత్రి నటన కూడా ఆ బాలనటుల ముందు బలాదూరే

  • ఏడుస్తూ అత్యద్భుతంగా నటించిన చిన్నారి రెడ్డి పాప

  • అమ్మఒడి ఆగిపోయిందంటూ రోదించిన మరో చిన్నారి రెడ్డమ్మ

  • దానికి సానుభూతి పోగేసిన వైసీపీ మీడియా

  • ఆ పేద ‘రెడ్డెమ్మ’కు బెజవాడలో ఓ బంగారుషాపు, పెట్రోల్‌బంకు

  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో లక్షల ఫీజులిచ్చి ఖరీదైన చదువు

  • మరి ఆ పేదరాలికి అమ్మఒడి ఇచ్చిన అధికారిపై వేటు వేయరా?

  • చిన్నప్పటి నుంచే చిన్నారులకు కులపిచ్చి అంటించిన వైసీపీ బ్యాచ్

  • జనం ఓడించినా జగన్‌కు ఇంకా సిగ్గురాలేదా?

  • జగన్ జిమ్మిక్కులకు చిన్నారులే దొరికారా?

  • సోషల్‌మీడియాపై జగన్నాటకంపై నెటిజన్ల ఫైర్

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ జైలు నుంచి వెళుతుండగా, జగనన్నా ప్లీజ్ ఒక్కసారి.. అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారి దేవికారెడ్డిని చూసిన జగన్ కారు ఆపారు. షిక్కటి షిరునవ్వు షిందిస్తూ పైకి రమ్మని పిలిచారు. అంతే ఆ చిన్నారి

ముఖంలో వెయ్యి ఓల్టుల బల్బు వెలిగింది. జగనన్న కూడా ఆ చిన్నారి నుదుట ముద్దు పెట్టుకున్నారు. యధాలాపంగా నెత్తిమీద చేయివేశారు. ఆ చిన్నారి కూడా మురిసిముక్కలయిపోయి జగనన్నతో సెల్ఫీ దిగింది. వెళుతూ వెళుతూ జగన్ మామకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.

ఆ తర్వాత వైసీపీ అధికార మీడియా రంగప్రవేశం చేసింది. స్టార్ట్ కెమెరా అనగానే.. ఇంకో చిన్నారి మహితారెడ్డి ‘‘నాకు ఇప్పటివరకూ అమ్మఒడి రాలేదు. అదే జగన్ మామ ఉన్నట్టయితే ఎప్పుడో వచ్చేది’’ అని ఏడుపు లంకించుకుంది. కట్ చేస్తే.. వైసీపీ మీడియా దానిని రాత్రి వరకూ తన చానెల్‌లో లాగించేసింది. సరే.. పొద్దున్నే సాక్షిలోనూ అదే ‘ఏడుపుగొట్టు వార్త’ అనుకోండి.
– ఇదీ వల్లభనేని వంశీని జైలులో పరామర్శించిన తర్వాత విజయవాడ జైలు వద్ద జగన్- ఆ చిన్నారులు జమిలిగా నటించిన అద్భుత దృశ్యాలు.

‘ ఆ బాలనటి బ్రహ్మాండంగా నటించింది. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంత చిన్న వయసులో అంత అద్భుతంగా నటిస్తుందనుకోలేదు’’ అని ఆ దృశ్యంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన తొలి వ్యాఖ్యను ఇప్పుడు యావత్ సోషల్‌మీడియా సైనికులు ఫాలో అవుతున్నారు.

నిజమే. ఒక కన్నాంబ.. ఒక కాంచన.. చిటికెడు పసుపు డబ్బా కుంకుమ జయంతి.. పిలవగానే కళ్ల వెంట గంగాభవానీ వచ్చి పలకరించే సుజాత, శారద.. వీరికి మించి మహానటి సావిత్రిని తలదన్నేలా ఏడుపు సీనును పండించిన ఆ చిన్నారి ‘రెడ్డమ్మ’కు బంగారు నంది అవార్డు ఇవ్వాల్సిందే. లేకపోతే కళాకారులకు అన్యాయం చేసినట్లేనన్నది సోషల్‌మీడియా సైనికుల ఉవాచ.

ఆ చిన్నారుల్లో ఎంత టాలెంట్ లేకపోతే.. ఎన్ని రోజులు రిహార్సల్ చేయకపోతే.. అలా జీవించగలుతారు? సినిమాల్లో కనిపించే రెగ్యులర్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈర్ష్యపడే స్థాయిలో, అలవోకగా నటనలో జీవించారంటే.. ఆ చిన్నారి రెడ్డమ్మలకు కచ్చితంగా ఆస్కార్‌కూ అర్హురాలేనేమోననిపిస్తుంది. ఓసారి ఆస్కార్ అవార్డుల కమిటీ ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది. వారికి అలాంటి ఐడియా తట్టకపోతే.. స్వయంగా జగనన్నే ఆస్కార్ జ్యూరీకి ఓ సిఫార్సు లేఖ రాస్తే ఆ బాలనటుల పుణ్యం పుచ్చినట్లే!

ఇంతకూ జగనన్నను చూసేందుకు తెగ ఏడ్చి, మహానటి సావిత్రిని కూడా ఈర్ష్యడపడేలా చేసిన ఆ చిన్నారి దేవికారెడ్డి, అమ్మఒడి రాలేదన్న మహితారెడ్డిది పాపం కడు పేద కుటుంబమట. ఎంత పేదరికమంటే… తినడానికి తిండి లేక, చదవుకునేందుకు ఫీజు కట్టుకోలేనంత దరిద్రమట. అందుకే అప్పటి జగన్ సర్కారు ఆ చిన్నారి రెడ్డమ్మ కుటుంబంపై దయతలచి, ‘అమ్మఒడి’ కింద ఏడాదికి 15 వేల రూపాయలు ఇచ్చింది. ఆ అమ్మఒడికి ఇచ్చిన ఆ 15 వేల రూపాయలకు మరికొన్ని లక్షల రూపాయలు జత చేసి, ‘నిరుపేదలు మాత్రమే’ చదువుకునే ‘ఢిల్లీ పబ్లిక్ స్కూల్’, ‘రవీంద్రభారతి’లో చేరారట.

అంతేనా? ఆ చిన్నారుల కుటుంబానికి బెజవాడలోనే ఓ బుల్లి బంగారుషాపు కూడా ఉందట. అది మూడునాలుగు ఫ్లోర్లకు మించి ఉండదండోయ్. అంతేనా? ఏదో పొట్టపోసుకునేందుకు బెజవాడలోనే, ఒక బుల్లి పెట్రల్‌బంక్ కూడా ఉందట. మరి ఇంత కడు పేదరాలయిన చిన్నారి రెడ్డమ్మ కుటుంబానికి తెల్లకార్డుతోపాటు, అమ్మఒడి ఇచ్చిన అధికారికి పౌరసన్మానం చేయడం పాలకుల బాధ్యత. ఇప్పటికయినా సదరు అధికారి గొప్పతనం తెలిసినందున, ఆ పనిని అర్జెంటుగా పాలకులు చేయకపోతే.. కనీసం జగనన్నా నడుం బిగించక తప్పదు.

జగన్‌తో సెల్ఫీ తీయించుకున్న చిన్నారి దేవికారెడ్డి.. తనకు అమ్మఒడి రాలేదన్న మహితారెడ్డి చదివేది బెజవాడ ఢిల్లీ పబ్లిక్‌స్కూల్, రవీంద్రభారతి స్కూల్‌లో. అక్కడ ఎల్‌కేజీ నుంచి యుకేజీ వరకూ ఫీజు 88 వేల రూపాయలు. 1 నుంచి 5 వ తరగతి వరకూ 1,02,000 రూపాయలు. 6 నుంచి 10 వరకూ 1,11,000 రూపాయలు. 11 నుంచి 12 వ తరగతి వరరూ 1,43,500 రూపాయలు. మరి పాపం ఆ పేదింటి రెడ్డమ్మకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అన్నేసి లక్షలు పెట్టి ఎవరు చదివిస్తున్నారన్నదే ప్రశ్న.

లేకపోతే కేవలం అమ్మఒడి ఇచ్చే డబ్బుతోనే ఢిల్లీ పబ్లిక్‌స్కూల్, రవీంద్రభారతి యాజమాన్యం దేవికారెడ్డి-మహితారెడ్డిని అనుమతిస్తున్నాయా? కొంపతీసి ఢిల్లీ పబ్లిక్‌స్కూల్-రవీంద్రభారతి యాజమాన్యం, ఈ మధ్య కొత్తగా ఏమైనా ‘చైల్డ్ ఆర్టిస్టు కోటా’ పెట్టిందా? అనేది ఇంకో డౌటనుమానం! మరి అలాంటి ఫెసిలిటీ ఉందని తెలిస్తే.. బెజవాడలోని వేలాదిమంది పిల్లలు, ఏ ఫిలింనగరంలోనో, ఏ యూసఫ్‌గూడలోని ఫిలిం ట్రైనింగ్ సెంటర్‌లోనో చేరి చైల్డ్ ఆర్టిస్టు సర్టిఫికెట్ తెచ్చుకుంటారు కదా?!

జనంలో జగన్ ఇమేజ్ పెంచేందుకు చిన్నారులను వాడుకోవడం అరాజకీయమే. ఇలాంటి వికృత రాజకీయ ఎత్తుగడ వల్ల.. జనంలో జగన్ ఇమేజ్ పోగవుతుందేమోగానీ, చిన్నారులకు సైతం కులగజ్జి అంటించిన పుణ్యం కూడా మూటకట్టుకుంటున్నారన్నది అంతే నిజం. చిన్నారులకూ రాజకీయ కులగజ్జి అంటించడం చూస్తే.. వైసీపీ వ్యూహబృందాలు, జగన్ కోసం సమాజంలోని ఏ వర్గాన్నీ వదిలేలా లేరని అర్ధమవుతూనే ఉంది.

ఇక మిగిలింది హిజ్రాలే. మరి వారి సేవలు ఎప్పుడు వినియోగిస్తారో వైసీపీ రాజకీయ వెండితెరపై చూడాలి. జగనన్నకు అలాంటి వయో-లింగ బేధాలేమీ లేవని, నిన్నటి ‘మగప్రేమ’తోనే తేలిపోయింది కాబట్టి.. పెద్దగా సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉండదు.

ఇంతకూ ఆ చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్పీరంగారావు కంటే మహానటుడని అతగాడు వివిధ సందర్భాల్లో, వివిధ భంగిమల్లో దిగిన ఫొటోలే చెబుతున్నాయి. అంటే జగన్ ఇమేజ్‌ను క్రేన్లతో పైకి లేపే ఇలాంటి ‘లేకి బృందానికి’, అతగాడే నాయకుడని అర్ధమవుతూనే ఉంది. జగన్ సాక్షిగా రెగ్యులర్‌గా జరిగే.. ఇలాంటి అన్ని ‘లేకి ఆలోచన’లకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు అతగాడేమోననిపించడం సహజం.

ఇప్పటివరకూ చిన్నపిల్లలు దేవుడితో సమానం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అనేవారు. ఎందుకంటే వారికి కల్లాకపటం తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు బెజవాడ బాలనటులు దేవికారెడ్డి-మహితారెడ్డి

అద్భుతం, అనితర సాధ్యం, అనన్యసామాన్యమైన నటన పుణ్యాన ఆ సామెతను నమ్మేరోజులు పోయినట్లే.

ఈ ఓవరాక్షన్‌పై సోషల్‌మీడియా సైన్యం జగన్-ఆయన సలహాదారులపై విరుచుకుపడుతోంది. ‘నీకు ఓడినా ఇంకా సిగ్గురాలేదా?.. చిన్నపిల్లలను రాజకీయాలకు వాడుకోవడానికి సిగ్గులేదూ’.. నీ రాజకీయ ప్రయోజనం కోసం తల్లి, చెల్లిని వాడుకున్నావు. ఇప్పుడు చిన్నపిల్లలనూ బలిచేస్తావా?’ అంటూ కామెంట్లు, గ్రాఫిక్కులతో శివమెత్తుతున్నారు.

అన్నట్లు.. బాలనటి దేవికారెడ్డి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దగ్గర బంధువట. ఇంతకూ పిన్నెల్లి ఎవరంటారా?.. అదేనండి. గత ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను నేలకేసి కొట్టిన దేశభక్తుడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? హమ్మయ్య! పులిపాడు గ్రామానికి చెందిన ఈ బాల నటీమణుల తండ్రి పేరు లక్ష్మణ్‌రెడ్డి. ఆయన బెజవాడ ఎంజీ రోడ్‌లోని బీఎన్‌ఆర్ గోల్డ్‌షాప్ అధిపతి.

ఇంతకూ.. జగనన్న ముందు అద్భుతంగా ఏడిచి, మీడియా ముందు అంతే మహాద్భుతంగా నటించిన బాలనటులైన దేవికారెడ్డి, మహితారెడ్డికి.. అమ్మఒడి పథకం మంజూరు చేసిన అధికారికి దండేసి దణ్ణం పెట్టి, సన్మానం చేస్తున్నారా? లేదా? ఇదీ ఇప్పుడు కూటమి సర్కారుపై సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న ప్రశ్న.

1 COMMENTS

LEAVE A RESPONSE