-స్వచ్ఛంద సంస్థలకు బాల వికాస ఆదర్శం
-బాల వికాస స్పూర్తితో ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు
-బాల వికాస సంస్థతో నాకు 40 ఏళ్ల అనుబంధం
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సమాజ సేవలో బాల వికాస సంస్థ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శం అని, సామజిక సేవలో నంబర్ వన్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల వికాస సంస్థ స్పూర్తితో ప్రభుత్వం కూడా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది అన్నారు. బాల వికాస సమాజ అభివృద్ధి పథకాల నాయకుల జాతీయ స్థాయి మహా సభకు నేడు కీసర గుట్టలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రసంగించారు.
40 ఏళ్ల నుంచి నాకు ఈ సంస్థతో సంబంధం ఉంది.బాలక్క చేసే సేవల్లో నేను అనేకసార్లు పాల్గొన్నాను.సంస్థ వ్యవస్థాకురాలు బాల థెరీసా సింగారెడ్డి(బాలక్క) వర్ధన్నపేట, రెడ్డిపాలెంలో పుట్టి కెనడాకు వెళ్లి ఆండ్రే జింగ్రాస్ ను వివాహమాడి, ఆయన ద్వారా అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఈరోజు 86 స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొనడం అభినందనీయం.
గత 40 ఏళ్లుగా బాల వికాస ద్వారా ఎలాంటి అభివృద్ది జరిగింది అని సమీక్ష చేసుకోవాలి.40 ఏళ్ల కింద మహిళలు బయటకు రావాలంటే భయపడేది. వస్తే వారిపై అభాండాలు వేసేవాళ్లు.మహిళల్లో చైతన్యం కల్పించి , సంఘాలు పెట్టీ ఆర్థిక చేయూత నివ్వడం ద్వారా వారికి ఆత్మ విశ్వాసం పెంచారు.వీరిని అప్పుడు ఎన్టీ రామారావు దగ్గరకు తీసుకెళ్తే డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు.వెనుకటి మహిళలు ఆర్థికంగా వెనుకబడ్డారు.స్త్రీ నిధి, డ్వాక్రా వంటి సంస్థల ద్వారా మహిళలు ఆర్ధికంగా బల పడ్డారు.వీటికి స్ఫూర్తి బాల వికాస సంస్థ. చెరువు పూడికలు తీర్చారు. దీని స్ఫూర్తిగా మిషన్ కాకతీయ ప్రభుత్వం తీసుకొచ్చింది.నేడు చెరువులు నీళ్లతో కళకళ లాడుతున్నాయి.గతంలో గ్రామాల్లో బోర్లలో నీళ్లు రాకపోయేది.బాల వికాస సంస్థ 1500కి పైగా వాటర్ ప్లాంట్ లు పెట్టింది.దీని స్ఫూర్తిగా ఇంటింటికి మంచి నీటిని ఇచ్చే మిషన్ భగీరథ తెచ్చారు.భర్త చనిపోయిన వారిని ఆదుకుని, వితంతువుల ద్వారా పూజలు చేయించింది.
వృద్ధులకు అనాథ ఆశ్రమాలు పెట్టింది.మహిళలలో ఐక్యత తీసుకువచ్చింది. ఆర్ధికంగా చేయూతనిచ్చింది.బాల వికాస ఆదర్శవంతమైన సంస్థల్లో నంబర్ వన్ సంస్థ.మనకు శిక్షణ ఇచ్చి, నాయకత్వ లక్షణాలు పెంచి, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేశారు.స్కూల్స్ బాగు చేశారు. మన ఊరు మన బడి ద్వారా సీఎం కేసీఆర్ గారు పాఠశాలలను బాగు చేస్తున్నారు. బాల వికాస సంస్థ కార్యక్రమాలు సమాజానికి చాలా ఉపయోగపడ్డాయి. గంగ దేవి పల్లిని ఆదర్శంగా తయారు చేసింది బాల వికాస సంస్థ.దేశంలో గొప్ప గ్రామంగా పేరు పొందింది. ఈరోజు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలను గంగ దేవి పల్లె వలె చేస్తున్నాం.గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు చేసి ఆదాయం తీసుకొస్తున్నాం.వైకుంఠ దామాలు నిర్మించాం.
దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేసి అవార్డులు ఇస్తే 19 తెలంగాణ కు వచ్చాయి.బాల వికాస సంస్థలో నేను కుటుంబ సభ్యున్ని.పది మందికి సేవ చేసే భాగ్యం ఈ సంస్థ అనేక మందికి కల్పిస్తుంది.ఈ సంస్థ ద్వారా చేసే సేవ వల్ల మీ కుటుంబాలు బాగుంటాయి.గతంలో ఇక్కడ రోడ్ కోసం 65 లక్షలు ఇచ్చాను. ఇంకా రోడ్లు వేయించే బాధ్యత నాది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థచైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరెడ్డి సింగారెడ్డి, ఇతర ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.