నలిగిపోతున్న బాల్యం..
నీ బిడ్డ భవిత
నీ కళ్ళ ముందే
చిక్కి శల్యం..!
నీ చిన్నతనం గురించి
గొప్పలు పోయే నువ్వు
అదే సంబరాన్ని
నీ పిల్లలకు దూరం చేస్తావా..?
ఎక్కడ ఆటలు..
ఎక్కడ తోటలు..
నాలుగు గోడల మధ్యే
నీరసించిపోతున్న
చిన్నారులు..
కుహానా సంస్కారాలు..
కృత్రిమ సంస్కృతులు..
బాల్యాన్ని మింగేస్తుంటే
అదే గొప్పని
చంకలు గుద్దుకునే నీ నైజం..
నీకు నువ్వే పెంచుకుంటున్న విలనిజం..!
స్వేచ్ఛా విహంగాల్లా ఎగరాల్సిన వయసును..
తుళ్ళి పడే మనసును
రాతి కట్టడాల నడుమ..
కుళ్ళు కట్టడుల మధ్య
బంధిస్తున్న నీ పెంపకం
దానికి నువ్వు పెట్టుకునే పేరు
క్రమశిక్షణ..
నిజానికది కఠినదండన!
కార్పొరేట్ చదువుల్లో..
ఇంటికి దూరంగా హాస్టల్లో..
సొగసైన కాంప్లెక్సుల్లో
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుల్లో
నలిగిపోతున్న బాల్యం..
అవేమీ పట్టని భ్రమల్లో
నీ కైవల్యం..
నువ్వు..నీ డాలర్ డ్రీమ్స్..
మావాడు ఎన్నారై..
అదేనా నీ భుజకీర్తి
గట్టిగా చెప్పాలంటే
అదో రకమైన కక్కుర్తి..!
జన్మనిచ్చిన నీకు
మంచి భవిత
ఇవ్వాలనే తపన…
అందుకోసం
ఎందుకింత యాతన…
ఎదగనీ సంబరంగా..
అంతవరకు భద్రం..
చెయ్యవద్దు బాల్యం చిద్రం!
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లోనే ఉంది సుమా కిల్
అనే మాట రెండుసార్లు..
Don’t you worry…
They will be up above the world..
Like a daimond
in the sky..
In the meanwhile
Let the kids
enjoy their
Lovely smile…!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948646286