హైదరాబాద్: తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు.. పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం.. కల్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ – చిరంజీవి
‘పవన్‌కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై
‘సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్‌కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ – చంద్రబాబు నాయుడు