Suryaa.co.in

Andhra Pradesh

దీక్షల హోరు.. ప్రజా పోరు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. చంద్రబాబు అమరావతి అనే ప్రపంచ స్థాయి రాజధానిని ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే..

జగన్ రెడ్డి కక్ష, కుట్రలు అనేవే ప్రధాన అజెండాగా పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు హోరెత్తారు. ఈ మేరకు ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను దేబురించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు.

అక్రమ కేసులతో ప్రజా స్వామ్యాన్ని హరిస్తూ పోలీస్ గుప్పిట్లో పాలన నడిపిస్తున్నాడు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయాలని కుట్రలు చేస్తున్న జగన్ రెడ్డి నియంతృత్వానికి శాశ్వత సమాధి కట్టేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్, సాధికార సమితి ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారే సమర్పించి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా జైలు నుండి బయటకు రావాలని కోరుకున్నారు.

విశాఖలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు మధ్యలో అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చంద్రబాబు అభిమాన సంఘం నేత తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండారపు శ్రీధర్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కె.ఈ.శ్యామ్ ఆశ్వర్యంలో తెలుగు యువత నాయకులు సైకిల్ ర్యాలీ చేపట్టారు.

శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. NTR విగ్రహానికి పూలమాల వేసి నాలుగు స్తంభాల మీదుగా అంబేత్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడులో తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఏలూరు నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఏలూరు చేపల తూము సెంటర్లో 26 వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద జైలు సెట్టింగ్ వేసి చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు.

శిoగనమల నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నార్పల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 25వరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నల్లగుడ్డలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి కుండలతో సైకో పోవాలి సైకిల్ రావాలని నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. ఆదోని నియోజకవర్గలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో 26వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగింది.

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వలసపాకల సెంటర్ లో మహిళలతో రిలే నిరాహరదీక్ష నిర్వహించారు.బాబు గారికి తోడుగా మేము సైతం అంటూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు.

కట్టెల పొయ్యి పై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి హిమని సర్కిల్ వరకు టీడీపీ నేతలు పాల్గొన్న నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‍కుమార్, నజీర్ అహ్మద్, మన్నవ మోహనకృష్ణ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని వినూత్నంగా భజన చేసి నిరసన తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇంఛార్జ్ సత్యానందరావు ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. సత్యం కోసం పోరాడిన గాంధీజీ స్ఫూర్తితో టోపీలను ధరించి జగన్ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.

నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, కాలవ శ్రీనివాసులు, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఎంఏ షరిఫ్, రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, గోరింట్ల బుచ్చియ్య చౌదరి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, పల్లా శ్రీనివాసరావు, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, నెట్టెం రాఘురాం, జివీ ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గంటా శ్రీనివాసరావు, పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు), వెలగపూడి రామకృష్ణబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్ కుమార్, గొల్లపల్లి సూర్యరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE