అంగన్వాడీ కార్యకర్తల నుంచి ఐఏఎస్‌ల దాకా వేతనాల్లేవ్
అప్పుల బాధతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి
కేంద్రం ఇస్తున్న నిధులన్నీ ఏమయ్యాయ్?
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్మండిపాటు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్అన్నారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబపోషణ కష్టమై నానాకష్టాలు పడుతున్నట్లు చెప్పారు. రోజువారీ ఖర్చులు, కరెంటు, రెంటు బిల్లులు చెల్లించడానికీ డబ్బుల్లేక ఉద్యోగులు అప్పులు చేస్తున్నారని, కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయం అకౌంటెంట్బలవన్మరణానికి పాల్పడడం ఉద్యోగుల దీనస్థితికి అద్దం పడుతోందన్నారు.
స్వచ్ఛ భారత్డ్రైవర్లకు ఐదు నెలలుగా, ‘సమగ్ర శిక్ష’ టీచర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకూ జీతాలు లేవని, ఇప్పుడు ఐఏఎస్‌లకూ జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్కింద ఏటా కేంద్రం సగటున ఇస్తున్న1500 కోట్ల రూపాయలు, ‘స్వచ్ఛ భారత్’ కింద ఇస్తున్న వందల కోట్ల నిధులు, ఐఏఎస్ ల జీతాల కోసం ఇస్తున్న కన్సాలిడేటెడ్ ఫండ్స్నిధులు ఏమవుతున్నాయని ప్రభుత్వాన్ని సత్యకుమార్ ప్రశ్నించారు.