Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ కే క్రైస్తవ సంఘాల మద్దతు

-మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్

క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ చర్చిలు, క్రైస్తవుల స్మశాన వాటికల అభివృద్ధితో పాటు క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. అలాగే రాబోయే కాలంలో క్రిస్టియన్ల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచి ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నిస్తానని వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఎవరు ఉన్నసరే వారిపై ఒత్తిడి తెచ్చి క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. క్రైస్తవుల గొంతుకగా నిలిచే తనను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని ఈ సమ్మేళనానికి హాజరైన వారిని కోరారు.

అలాగే మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెక్యులర్ అనే దానికి పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సెక్యులర్ విధానాలను పాటించి, మైనారిటీలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.
ఈ సమ్మేళనానికి విచ్చేసిన సీఎస్ఐ, ప్రీ మెథడిస్ట్, బాపిస్ట్, సాల్వషన్ ఆర్మీ, క్యాథలిక్ అసోసియేషన్, దళిత సంఘాల ప్రతినిధులు, సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పాస్టర్లు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ని ఆశీర్వదించారు..

ఈ కార్యక్రమంలో పాస్టర్లు లెనార్డ్, తినకరాన్, ఆనంద్ కుమార్, సుదర్శన్, జాకబ్, బిషప్ జాకబ్, గడ్డం సోలోమాన్, జాన్ రవీంద్ర, రాబర్ట్ సూర్య ప్రకాష్, సునీల్, డేవిడ్ రాజ్, క్యాథలిక్ లీడర్ ఎంవీ లియో, డేవిడ్ శాంతి కుమార్, దయాకర్, ప్రవీణ్, కెన్నీ, డేవిడ్, ఆల్ ఇండియా క్యాధలిక్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆండ్రూ క్సైవర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE