Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో క్రైస్తవులు కూడా బాధితులే

-జగన్ పాలనలో పాస్టర్ల మీద దాడులు
-చర్చిల్లో విబేధాలు సృష్టిస్తున్నారు
-ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు
-క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది
-పాస్టర్లు పెళ్లిళ్లు చేసే విధంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తాం
-జగన్ తెచ్చిన మూడేళ్ల నిబంధన ఎత్తేస్తాం
-కడప జిల్లా పాస్టర్ల తో సమావేశమైన నారా లోకేష్

జగన్ పాస్టర్ల కు గౌరవ వేతనం ఇస్తామని మోసం చేశారు. కనీసం 10 శాతం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు అదీ లేదు.లక్షకు పైగా ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. మమ్మల్ని రాజకీయంగా వాడుకొని జగన్ మోసం చేశారు.10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి.క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలి. ఇళ్లు నిర్మించి పాస్టర్ల కాలనీలు ఏర్పాటు చేయాలి. చర్చిల నిర్మాణం కోసం 5 సెంట్ల భూమి కేటాయించాలి. చర్చిల అభివృద్ది కి జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు.పాస్టర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.

క్రిస్టియన్లు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పర్మినెంట్ మ్యారేజ్ లైసెన్స్ జగన్ ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు కేవలం మూడేళ్లకు రెన్యువల్ చేసుకోవాలి అని నిబంధన పెట్టింది.
ప్రత్యేక స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నాం. హెల్త్ ఇన్స్యరెన్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. చనిపోతే ప్రభుత్వం నుండి కుటుంబానికి ఎటువంటి సాయం అందడం లేదు. క్రిస్టియన్, మైనార్టీ బోర్డు ద్వారా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దీనిని విడదీసి పెడితే మాకు న్యాయం జరుగుతుంది. చర్చిల నిర్మాణం కోసం 7 వేల ధరఖాస్తులు వస్తే జగన్ ప్రభుత్వం ఈ రోజు వరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదు.

ఎటువంటి ష్యురిటి లేకుండా లక్ష రూపాయిలు వరకూ బ్యాంకు రుణాలు అందేలా చూడాలి. జెరూసలేం యాత్ర కు ఆర్ధిక సాయం అందించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ కానుక కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. పాస్టర్ల కు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. జగన్ మాట తప్పాడు… మడమ తిప్పాడు. జగన్ పాలనలో పాస్టర్ల కు కనీస గౌరవం దక్కడం లేదు. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. మేము న్యాయం వైపు నిలబడతాం. వైసిపి నాయకుల పిచ్చి పరాకాష్ట కు చేరింది కడప జిల్లా లో ఒక చర్చి పై వైసిపి జెండా ఎగరేసిన ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం ఇవ్వడం లేదు.  – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కడప జిల్లా పాస్టర్లు

వారి సమస్యలపై స్పందించిన లోకేష్‌ ఏమన్నారంటే..
పాస్టర్లు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. జగన్ పాలనలో పాస్టర్ల కి కనీస గౌరవం లేదు. జగన్ పాలనలో క్రైస్తవులు కూడా బాధితులే. జగన్ పాలనలో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిల్లో విబేధాలు సృష్టిస్తున్నారు. క్రిస్టియన్ల సమస్యలు పరిష్కారం కోసమే టిడిపి క్రిస్టియన్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం.టిడిపి హయాంలో ఏ మతం పైనా దాడులు జరగలేదు. గుడి పై దాడి జరిగినప్పుడు చంద్రబాబు వెళితే కొంత మంది విమర్శించారు. ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు .హైదరాబాద్ లో మత ఘర్షణలు జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసింది చంద్రబాబు.జగన్ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టారు.

క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. టిడిపి హయాంలో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కి సహాయం చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కి సాయం చేస్తాం.చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం. మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక స్మశానాలు ఏర్పాటు చేస్తాం. జరుసలేం యాత్ర కు సబ్సిడీ పెంచుతాం.హెల్త్ కార్డులు, చనిపోతే 10 లక్షల ఆర్ధిక సాయం కుటుంబానికి అందిస్తాం.

ఇండిపెండెంట్ చర్చిలు, పాస్టర్ల కు గౌరవ వేతనం పక్కాగా అందిస్తాం. మంగళగిరి లో క్రిస్మస్ అప్పుడు పాస్టర్ల కు గౌరవంగా బట్టలు పెడుతున్నా. పాస్టర్లు పెళ్లిళ్లు చేసే విధంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తాం. జగన్ తెచ్చిన మూడేళ్ల నిబంధన ఎత్తేస్తాం. బైబిల్ కాలేజ్ ఏర్పాటుకి సహకరిస్తాం. పాస్టర్ల కు గుర్తింపు కార్డులు అందజేస్తాం. క్రిస్మస్ ఘనంగా జరిపేందుకు సహకరిస్తాం.ఏ మతాన్ని మేము చిన్న చూపు చూడం. జగన్ సృష్టించే అపోహలు నమ్మొద్దు. దళిత క్రైస్తవులకు లబ్ధి చేకూరేలా టిడిపి గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం.

LEAVE A RESPONSE