తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే రాధాకృష్ణపై సీఐడీ తప్పుడు కేసు

– కేసులు పెట్టాల్సింది తప్పుల్ని ఎత్తిచూపుతున్న వారిపై కాదు, తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్న జగన్ పై
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ ఎఫ్ ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా?
లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు? తాడేపల్లి తాబేదారుల నుంచి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారు. దాదాపు 30 గంటల తర్వాత జీరో ఎప్.ఐ.ఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. జీరో ఎప్.ఐర్ నమోదు చేయాల్సి ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ఎత్తిచూపుతున్న ‎ వారిపై కాదు, తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్న జగన్ రెడ్డి పైనే జీరో ఎ.ఫ్.ఐ.ర్ లు నమోదు చేయాలి. జగన్ చేసిన తప్పులకు, అవినీతికి జీరో ఎప్.ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిపోలీస్ స్టేషన్లలో ఎప్.ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపో‎తాయి.
రాష్ట్రంలో అవినీతి సాక్షి తప్పించి మరో మీడియా ఉండేందుకు వీల్లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు ఎన్నాళ్లు సంకెళ్లు వేస్తారు? జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పు వైసీపీ పాలనకు ముప్పుగా మారుతుంది.