– మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో సీఐడీ శాఖ ఆకృత్యాలు, అచారకాలు అధికమయ్యాయని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
సీఐడీ కేవలం టీడీపీ నాయకులను వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, అక్రమ కేసులు బనాయించడానికే ఉన్నట్లుంది. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను, కార్యకర్తలను కష్టోడియల్ టార్చర్ పెట్టడానికే సీఐడీని వినియోగిస్తున్నట్లు స్పష్టమౌతోంది. సీఐడీ నిష్పచ్ఛపాతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ. పోలీసు శాఖలో అదొక విభాగం. రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు ఉన్నట్లుగా వైసీపీ సీఐడీని అనుబంధ విభాగంగా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. వైసీపీ ప్రజల కోసం పనిచేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. సీఐడీ రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారింది. సీఐడీ క్రైం కేసుల్లోని వాస్తవాలను వెలికితీయాల్సివుంది. కానీ ఆదిశగా ప్రయత్నించడంలేదు. ఎంతో ప్రాధాన్యత ఉండి మరుగున పడిపోతున్న కేసులు టేకప్ చేయాల్సిన సీఐడీ మిన్నకుంది.
తెలుగుదేశం కార్యకర్తో, నాయకుడో ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెడితే సీఐడీ అధికారులే ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారు. పనికట్టుకొని రాత్రికి రాత్రే వారి ఇళ్లమీదికి పోతున్నారు. ఇళ్లల్లోకి ఎవరు వస్తున్నారో తెలియని పరిస్థితి. వచ్చేవారు వైసీపీ గూండాలో, సీఐడీ పోలీసులో తెలియడంలేదు. వచ్చినవారు బందిపోటు దొంగలా? పోలీసులా తెలియని పరిస్థితి. సుప్రీంకోర్డు నిబంధనల ప్రకారం కేసుల విచారణ సమయంలో యూనిఫాం, బ్యాడ్జి ఉండాలి. కానీ ఉండడంలేదు.
టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఐడెంటీ కార్డు చూపడంలేదు. సీఐడీ శాఖలో పై నుంచి కింది వరకు ఎస్పీలెవరో, డీఎస్పీలెవరో అర్థం కావడంలేదు. ఎవరు ఇంటికొచ్చి తీసుకెళ్తున్నారో? ఎవరు ఇంటరాగేట్ చేస్తున్నారో తెలియదు. ఎవరు కోర్టుకి బందోబస్తుకు వస్తున్నారో తెలియదు. దాగుడుమూతలు ఆడుతున్నారు. టీడీపీ కార్యకర్తల్ని, నాయకులను భయభ్రాంతుల్ని చేస్తున్నారు. జగన్, సజ్జల డైరెక్షన్ లో ఈ తంతు జరుగుతోంది. కిందిస్థాయి కానిస్టేబుల్ నుండి పైస్థాయి అధికారి వరకు చేసే ప్రతి దురాగతానికి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బాధ్యత వహించాలి. దళితుడైన చీఫ్ సునీల్ కుమార్ అనేక మంది దళితులను సీఐడీ డిపార్టుమెంటులో అధికారులుగా పెట్టుకొని వారిచేత ఇంటరాగేట్ చేయిస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో దళిత సమాజంపై పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో దళితలు బలిపశువులయ్యే అవకాశముంది. చేసే ఆకృత్యాలనన్నింటిని దళిత కమ్యునిటీకి అంటగడుతున్నారు. దళితులను ద్వేషించే స్థితి తీసుకొచ్చారు. దుందుడుకు చర్యలకు దిగి టీడీపీపై కక్షసాధిస్తున్నారు. టీడీపీ నాయకులపై కస్టోడియల్ టార్చర్ అధికమైంది.
టీడీపీ సాక్ష్యాధారాలతో సహా 300కు పైగా ఫిర్యాదులు చేసినా ఫలితంలేదు. ఒక్క కేసుకు దిక్కూ దివాణంలేదు. వైసీపీ నుండి ఒక్క చిన్న ఫిర్యాదు వచ్చినా సీఐడీ అధికారులు వెంటనే స్పందించి ఆగమేఘలపై చర్యలుంటాయి. తరువాత తాము చేసిన తప్పులను సరిచేసుకోవచ్చు అనే భ్రమలో అధికారులున్నారు. ఎవరో వచ్చి ప్రొటెక్ట్ చేస్తారనుకోవద్దు. వైసీపీ రాక్షస క్రీడలకు అంతకంత చెల్లించుకోవాల్సివుంటుంది. వైసీపీ రాక్షస క్రీడలకు అంతకంత చెల్లించుకోవాల్సివుంటుంది. చట్టం అందరికీ సమానమనే విషయాన్ని పోలీసులు మరిచారు. రాష్ట్రంలో ఐపీసీ పనిచేయడంలేదు. అంబేద్కర్ రాజ్యంగాన్ని నిట్టనిలువున పాతర వేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని సీఐడీ అధికారులు గ్రహించాలి. 70 సంవత్సరాల ముదుసలి రంగనాయకమ్మ మొదలుకొని 4 సంవత్సరాల చింతకాయల విజయ్ కుమార్తె పసిపాప వరకు ఎవరినీ వదలకుండా హింసించారు. వారిని ఇంటరాగేట్ చేశారు. డ్రైవర్ లను చంపుతున్నారు.
శిరోముండనాలు, లాకప్ డెత్ లు వైసీపీ హయాంలోనే జరిగాయి. డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే. పిచ్చి కేసులు పెడుతున్నారు. అమానుషంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం మానాలి. చుండూరుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ వస్తే దాన్ని సీఐడీ చీఫ్ విమర్శిస్తూ ఒక నవల కూడా రాశారు. అవన్నీ గుర్తు చేసుకోవాలి. జగన్ రెడ్డికి తాబేదారులా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఏం చేయలేరు. పెద్దపెద్ద కేసులు ఏం చేశారు?. బాబాయి కేసుకు దిక్కు, దివాణంలేదు. జగన్ బాబాయి చనిపోతే నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో పెద్దగా వేశారు. దీనని జగన్ కడుక్కోవాలి. ఏ రాష్ట్రంలో జరగనన్ని ఆకృత్యాలు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని దళితులపై జరిగాయి. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడంలేదు. కేవలం కళంకిత అధికారులు, అత్యుత్సాహం చూపే వారికి మాత్రమే సూచిస్తున్నాం.
రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని జగన్ ఆనాడు చెప్పాడు. ఒకటిన్నర సంవత్సరం తరువాత తెలుగుదేశం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుంది, మళ్లీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారు. జాబితా తయారు చేస్తున్నాం. తరువాత జవాబు చెప్పాల్సివుంటుంది. సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేస్తే పట్టుకుపోతారా? వైసీపీ పెద్ద యంత్రాంగం తయారు చేసుకుంది. నియోజకవర్గానికి ఆరుగురిని పెట్టకున్నారు. పెద్ద ఐప్యాక్ తో సమాజంలో విషప్రచారం చేస్తున్నారు. వారిపై మాత్రం చర్యలుండవు. వాలంటీర్లు వైసీపీ జేబు సంస్థలా, అనుబంధ సంస్థల్లా పనిచేస్తున్నారు. రాజధాని రైతులను అనేక విధాల వేధింపులకు గురిచేశారు. ఏ ఏ కేసులు పెట్టాలని దుర్బిణీ పట్టుకొని వెతికారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ అన్నారు, తుస్ మంది. ఇప్పటికీ రాజధాని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు, తమపై పెడుతున్న ఇబ్బందులు పడతాం. భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తేల్చి చెప్పారు.