-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి అందజేసిన సీఐఐ ప్రతినిధులు
నవ్యాంధ్ర అభివృద్ధికి తాము రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఏపీ ఛైర్మన్ డాక్టర్ వి మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్ జి మురళీకృష్ణల బృందం అందజేసింది. ఉండవల్లి నివాసంలో బుధవారం టిడిపి యువనేతని కలిసిన సీఐఐ బృందం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజులలో చేపట్టాల్సిన చర్యలపై నివేదిక అందజేసింది. అభివృద్ధి, ఆదాయం పెంపు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలు ఈ విజన్ డాక్యుమెంటులో ఉన్నాయి. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా సృజనాత్మకమైన అంశాలు ఈ పాలసీలో పొందుపరిచారు.