Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే ఆర్కేకు పనిచేసే మనసులేదు

-పట్టాలు రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఆర్కే మోసం చేశారు!
-లోకేష్ ఎదుట యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసుల గోడు

మంగళగిరి: పెన్షన్ల విషయంలో టీడీపీపై జగన్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, రాబోయే ప్రజా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఇంటి వద్దే అందిస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. చినకాకాని యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసులతో యువనేత బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈనెలలో సకాలంలో పెన్షన్ అందక 32మంది చనిపోయారు.

మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ను 4వేల రూపాయలకు పెంచడంతోపాటు వాలంటీర్ల ద్వారా ఇతర సంక్షేమ పథకాలను అమలుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సమస్యలను చెబుతూ… మా ప్రాంతంలో 400కుటుంబాలు ఉన్నాయి, గత ఎన్నికల సమయంలో ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పిన ఆర్కే అయిదేళ్లుగా కన్పించకుండా పోయారు. మా ప్రాంతంలో అంగన్ వాడీ భవనం, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. స్కూలు, వీధిదీపాలు ఏర్పాటుచేయాలి. 1999లో చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, స్మశాన వాటిక ఏర్పాటుచేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆర్కేకు పనిచేసే మనసులేదు. ఆయన అద్భుతమైన నటుడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలనీవాసులు కోరిన విధంగా ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని లోకేష్ హామీ ఇస్తారు. కాలనీవాసులు నా దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటిటీ పరిష్కరిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు

LEAVE A RESPONSE